ఎంతజాణ వీ చేఁతలకేమని నుతింతునయ్య
(॥పల్లవి॥)
ఎంతజాణ వీ చేఁతలకేమని నుతింతునయ్య
వింత వింత వేడుకల వెలసె మీవలపు
(॥ఎంత॥)
కాఁకలతో వసివాడి గక్కన నిన్నుఁ జూచి
పోఁకముడి వీడి యింతి పొంచి లోలో నవ్వెన
యేఁకట నీవవి చూచి ఇంతలో నీపచ్చడము
తేఁకువగాఁ గప్పితివి తేరె నన్ని పనులు
(॥ఎంత॥)
వెదకి వెదకి నిన్ను వెలఁది కెంగేలు వట్టి
మదనరసము చింది మరి సిగ్గు వడెను
అది యెరిఁగి నీవు ఆకెకన్ను మొరఁగి
పదనుఁ బదనుఁ గూడఁ బన్నీరు చల్లితివి
(॥ఎంత॥)
మక్కువఁ గాఁగిటఁ గూడి మగువ నిన్ను మరిగి
యిక్కువ నందలాన నీయింటి కేఁగెను
అక్కరై శ్రీవేంకటేశ ఆకెఅందలముపైనే
యెక్కుక యేఁగుఁబెండ్లి యింతటా నేఁగితిరి
(||pallavi||)
ĕṁtajāṇa vī sem̐talagemani nudiṁtunayya
viṁta viṁta veḍugala vĕlasĕ mīvalabu
(||ĕṁta||)
kām̐kalado vasivāḍi gakkana ninnum̐ jūsi
pom̐kamuḍi vīḍi yiṁti pŏṁchi lolo navvĕna
yem̐kaḍa nīvavi sūsi iṁtalo nībachchaḍamu
tem̐kuvagām̐ gappidivi terĕ nanni panulu
(||ĕṁta||)
vĕdagi vĕdagi ninnu vĕlam̐di kĕṁgelu vaṭṭi
madanarasamu siṁdi mari siggu vaḍĕnu
adi yĕrim̐gi nīvu āgĕgannu mŏram̐gi
padanum̐ badanum̐ gūḍam̐ bannīru sallidivi
(||ĕṁta||)
makkuvam̐ gām̐giḍam̐ gūḍi maguva ninnu marigi
yikkuva naṁdalāna nīyiṁṭi kem̐gĕnu
akkarai śhrīveṁkaḍeśha āgĕaṁdalamubaine
yĕkkuga yem̐gum̐bĕṁḍli yiṁtaḍā nem̐gidiri