ఎంతైనాఁ దనతో నే నెగ్గుపట్టేనా
(॥పల్లవి॥)
ఎంతైనాఁ దనతో నే నెగ్గుపట్టేనా
చెంతనుండి నాచే సేవ సేయించుకొనుఁగాక
(॥ఎంతై॥)
సేయఁగలవెల్లాఁ జేసి సిగ్గులు వడఁగ నేలే
చాయ సేసుకొని పొందు జరపుఁగాక
యే యెడనో వుండి వచ్చి యేల వొడఁబరచీనే
నాయందు కూరిమి చల్లి నవ్వుఁగాకా
(॥ఎంతై॥)
ముం దెవ్వతెనో పెండ్లాడి మొక మేమి చూచీనే
అందాలు సేసుక మాఁటలాడుఁగాక
విందు లెందో ఆరగించి విడెము లే లడిగీనే
అంది నా పానుపుపైనే యవధరించుఁగాకా
(॥ఎంతై॥)
చుట్టాల సురభి తాను చొక్కుల నేల పెట్టీనే
గుట్టుతోడ నా కాఁగిటఁ గూడుఁగాక
యిట్టె శ్రీవేంకటేశుఁ డేలి న న్నేల మెచ్చీనే
జట్టిగాఁదనకే మోవి చవిచూపుఁగాకా
(||pallavi||)
ĕṁtainām̐ danado ne nĕggubaṭṭenā
sĕṁtanuṁḍi nāse seva seyiṁchugŏnum̐gāga
(||ĕṁtai||)
seyam̐galavĕllām̐ jesi siggulu vaḍam̐ga nele
sāya sesugŏni pŏṁdu jarabum̐gāga
ye yĕḍano vuṁḍi vachchi yela vŏḍam̐barasīne
nāyaṁdu kūrimi salli navvum̐gāgā
(||ĕṁtai||)
muṁ dĕvvadĕno pĕṁḍlāḍi mŏga memi sūsīne
aṁdālu sesuga mām̐ṭalāḍum̐gāga
viṁdu lĕṁdo āragiṁchi viḍĕmu le laḍigīne
aṁdi nā pānububaine yavadhariṁchum̐gāgā
(||ĕṁtai||)
suṭṭāla surabhi tānu sŏkkula nela pĕṭṭīne
guṭṭudoḍa nā kām̐giḍam̐ gūḍum̐gāga
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍeli na nnela mĕchchīne
jaṭṭigām̐danage movi savisūbum̐gāgā