Emtainaa ninnu namminaa yegasakkelegaaga

ఎంతైనా నిన్ను నమ్మినా యెగసక్కేలేగాక
Language

(॥పల్లవి॥)
ఎంతైనా నిన్ను నమ్మినా యెగసక్కేలేగాక
కాంతతోడ నీవేల కతలు చెప్పేవు

(॥ఎంతై॥)
నెలఁత నీవద్దనుండి నేరములు మోపఁగాను
యెలమి లేదంటా నాన లేల పట్టేవు
చలపట్టి కమ్మటిని సాకిరులు దెలుపఁగా
బలిమి నీవేఁటికి బాసలు చేసేవు

(॥ఎంతై॥)
మగువ నీమేనిమీఁద మచ్చములు చూపఁగాను
పగటున నీ వేమి నెవాలు చెప్పివు
తగ మిమ్మిద్దరి నేకతమునఁ జూచుచుండఁగాను
వెగటుగాఁ జొక్కించేల వేసాలు చేసేవు

(॥ఎంతై॥)
కామిని నీ యింటిలోన గాఁపురము సేయఁగాను
ఆముకొని నీ వెట్లా నరుదంపేవు
చేముంచి నన్నేలితివి శ్రీ వేంకటేశ్వర
నా మోము చూచి యేరా నవ్వులు నవ్వేవు

(||pallavi||)
ĕṁtainā ninnu namminā yĕgasakkelegāga
kāṁtadoḍa nīvela kadalu sĕppevu

(||ĕṁtai||)
nĕlam̐ta nīvaddanuṁḍi neramulu mobam̐gānu
yĕlami ledaṁṭā nāna lela paṭṭevu
salabaṭṭi kammaḍini sāgirulu dĕlubam̐gā
balimi nīvem̐ṭigi bāsalu sesevu

(||ĕṁtai||)
maguva nīmenimīm̐da machchamulu sūbam̐gānu
pagaḍuna nī vemi nĕvālu sĕppivu
taga mimmiddari negadamunam̐ jūsusuṁḍam̐gānu
vĕgaḍugām̐ jŏkkiṁchela vesālu sesevu

(||ĕṁtai||)
kāmini nī yiṁṭilona gām̐puramu seyam̐gānu
āmugŏni nī vĕṭlā narudaṁpevu
semuṁchi nannelidivi śhrī veṁkaḍeśhvara
nā momu sūsi yerā navvulu navvevu