ఎంతైనా నెఱఁగవు యెమ్మెలు చూపేవు నీవు
(॥పల్లవి॥)
ఎంతైనా నెఱఁగవు యెమ్మెలు చూపేవు నీవు
అంతటా నీకె యాకె అప్పణియ్యవలెనా
(॥ఎంతై॥)
తప్పక చూచీ నీతో తలవంపే చాలదా
వుప్పటించి నిన్ను వేరె వొరయఁగవలెనా
పిప్పిగట్టఁ బెదవులఁ బేరఁ దిట్టవలెనా
కప్పురగంది నిన్నుఁ గసరఁగవలెనా
(॥ఎంతై॥)
వూరకుంటేఁ జాలదా వువిద నీతో నిప్పుడు
గోరపెట్టి సారెసారెఁ గోపగించవలెనా
నీరాక దెలిసియు నిద్దిరించెఁ జాలదా
బీరమాడి నిన్ను రతి బెండుసేయవలెనా
(॥ఎంతై॥)
చేత మొక్కెఁ జాలదా చేకొని నిన్నిఁక వేరే
రాతిరిఁ బగలుఁ గడురాఁపు సేయవలెనా
నీతితో శ్రీ వేంకటేశ నిన్నుఁ గూడెఁ జాలదా
యీతరుణి నేఁడే నీయింటికి రావలెనా
(||pallavi||)
ĕṁtainā nĕṟam̐gavu yĕmmĕlu sūbevu nīvu
aṁtaḍā nīgĕ yāgĕ appaṇiyyavalĕnā
(||ĕṁtai||)
tappaga sūsī nīdo talavaṁpe sāladā
vuppaḍiṁchi ninnu verĕ vŏrayam̐gavalĕnā
pippigaṭṭam̐ bĕdavulam̐ beram̐ diṭṭavalĕnā
kappuragaṁdi ninnum̐ gasaram̐gavalĕnā
(||ĕṁtai||)
vūraguṁṭem̐ jāladā vuvida nīdo nippuḍu
gorabĕṭṭi sārĕsārĕm̐ gobagiṁchavalĕnā
nīrāga dĕlisiyu niddiriṁchĕm̐ jāladā
bīramāḍi ninnu radi bĕṁḍuseyavalĕnā
(||ĕṁtai||)
seda mŏkkĕm̐ jāladā segŏni ninnim̐ka vere
rādirim̐ bagalum̐ gaḍurām̐pu seyavalĕnā
nīdido śhrī veṁkaḍeśha ninnum̐ gūḍĕm̐ jāladā
yīdaruṇi nem̐ḍe nīyiṁṭigi rāvalĕnā