Emtainaa nekkinavaani kenumgu gujjegaadaa

ఎంతైనా నెక్కినవాని కేనుఁగు గుజ్జేకాదా
Language

(॥పల్లవి॥)
ఎంతైనా నెక్కినవాని కేనుఁగు గుజ్జేకాదా
పంతమున మొగవానిఁ బచ్చి సేతురటవే

(॥ఎంతై॥)
మనసుమర్మమెఱిఁగి మాటలాడవలెఁగాక
చనవుగద్దంటాఁ బతి జంకింతురటే
చెనకితే ప్రియములుచెప్పి లాలింతురు గాక
కినిసి మారుకుమారు గేలిసేతురటవే

(॥ఎంతై॥)
వేళచూచుకొని నీవే వేఁడుకొనవలెఁగాక
మేలుగద్దంటా నట్టె మీరుదురటే
చేలకొంగు వట్టితేను సిగ్గువడుదురుగాక
పేలరివు యింతేసి పెనఁగుదురటవే

(॥ఎంతై॥)
కావించి నీవే యిచ్చకము లాడుదురు గాక
శ్రీవేంకటేశ్వరు నింతసేతురటే
యీవిభుఁడె నిన్నుఁ గూడె నిందుకు మొక్కుటకు గాక
భావించి యలమేల్మంగ పదరుదురటవె

(||pallavi||)
ĕṁtainā nĕkkinavāni kenum̐gu gujjegādā
paṁtamuna mŏgavānim̐ bachchi seduraḍave

(||ĕṁtai||)
manasumarmamĕṟim̐gi māḍalāḍavalĕm̐gāga
sanavugaddaṁṭām̐ badi jaṁkiṁturaḍe
sĕnagide priyamulusĕppi lāliṁturu gāga
kinisi mārugumāru geliseduraḍave

(||ĕṁtai||)
veḽasūsugŏni nīve vem̐ḍugŏnavalĕm̐gāga
melugaddaṁṭā naṭṭĕ mīruduraḍe
selagŏṁgu vaṭṭidenu sigguvaḍudurugāga
pelarivu yiṁtesi pĕnam̐guduraḍave

(||ĕṁtai||)
kāviṁchi nīve yichchagamu lāḍuduru gāga
śhrīveṁkaḍeśhvaru niṁtaseduraḍe
yīvibhum̐ḍĕ ninnum̐ gūḍĕ niṁdugu mŏkkuḍagu gāga
bhāviṁchi yalamelmaṁga padaruduraḍavĕ