Emtainaa nee yalavaatlela maanevu

ఎంతైనా నీ యలవాట్లేల మానేవు
Language

(॥పల్లవి॥)
ఎంతైనా నీ యలవాట్లేల మానేవు
వింతలు సేయవుగా వెలఁదుల యెడను

(॥ఎంతై॥)
వాసికిఁ గొంగువట్టేవు వడి నీవు గొల్లెతల
సేసినట్టెల్లా ముందు చెల్లెనంటాను
ఆసలఁ జేయిచాఁచేవు అల్లనాఁడు రుక్మిణిని
వేసుకొంటి నిఁకలేదు వేసరంటాను

(॥ఎంతై॥)
యింటికి రప్పించుకొంటి విట్లాఁ బదారువేల
యింటఁ బెట్టుకొంటి రతికెక్కెనంటాను
జంట సాము నెరపేవు సత్యభామకు విల్లిచ్చి
వెంటఁబెట్టుకొన్నసుద్ది వెలసెనంటాను

(॥ఎంతై॥)
శిరసు వంచి మొక్కేవు శ్రీవేంకటేశ నీ-
శిరసుపైఁ దొళశమ్మ చేరెనంటాను
యిరవై నన్ను నేలితి విందిరను భూసతిని
యిరుమేలా నిడుకొని యేలితినంటాను

(||pallavi||)
ĕṁtainā nī yalavāṭlela mānevu
viṁtalu seyavugā vĕlam̐dula yĕḍanu

(||ĕṁtai||)
vāsigim̐ gŏṁguvaṭṭevu vaḍi nīvu gŏllĕdala
sesinaṭṭĕllā muṁdu sĕllĕnaṁṭānu
āsalam̐ jeyisām̐sevu allanām̐ḍu rukmiṇini
vesugŏṁṭi nim̐kaledu vesaraṁṭānu

(||ĕṁtai||)
yiṁṭigi rappiṁchugŏṁṭi viṭlām̐ badāruvela
yiṁṭam̐ bĕṭṭugŏṁṭi radigĕkkĕnaṁṭānu
jaṁṭa sāmu nĕrabevu satyabhāmagu villichchi
vĕṁṭam̐bĕṭṭugŏnnasuddi vĕlasĕnaṁṭānu

(||ĕṁtai||)
śhirasu vaṁchi mŏkkevu śhrīveṁkaḍeśha nī-
śhirasubaim̐ dŏḽaśhamma serĕnaṁṭānu
yiravai nannu nelidi viṁdiranu bhūsadini
yirumelā niḍugŏni yelidinaṁṭānu