ఎంతైనా నమ్మదు చిత్తమేమో కాని
(॥పల్లవి॥)
ఎంతైనా నమ్మదు చిత్తమేమో కాని
యింతటి నీ మాయ లిఁకనేమో కాని
(॥ఎంతై॥)
సరుగననెంత నాతో సరసములాడినాను
యెరవెరవైతోఁచీ నేమోకాని
వరుస వంతులు నీవు వలపెంత చల్లినాను
యిరవై మరపు ముంచీ నేమోకాని
(॥ఎంతై॥)
నగుతా నీవెంత నాతో నయగారాలు సేసినా
నెగసక్యాలే తోఁచీ నేమోకాని
మొగము చూచి నీవు ముచ్చటలెంతాడినాను
యిగిరించీ ననుమాన మేమోకాని
(॥ఎంతై॥)
కదిసి నీవెంత నన్ను కాఁగిలించుకోనినాను
యిదెనామై పులకించ దేమోకాని
అదన శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యెదుటనే బ్రమసితి నేమోకాని
(||pallavi||)
ĕṁtainā nammadu sittamemo kāni
yiṁtaḍi nī māya lim̐kanemo kāni
(||ĕṁtai||)
sarugananĕṁta nādo sarasamulāḍinānu
yĕravĕravaidom̐sī nemogāni
varusa vaṁtulu nīvu valabĕṁta sallinānu
yiravai marabu muṁchī nemogāni
(||ĕṁtai||)
nagudā nīvĕṁta nādo nayagārālu sesinā
nĕgasakyāle tom̐sī nemogāni
mŏgamu sūsi nīvu muchchaḍalĕṁtāḍinānu
yigiriṁchī nanumāna memogāni
(||ĕṁtai||)
kadisi nīvĕṁta nannu kām̐giliṁchugoninānu
yidĕnāmai pulagiṁcha demogāni
adana śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yĕduḍane bramasidi nemogāni