Emtainaa naaduvaaramu yimchugamta guttu vale

ఎంతైనా నాడువారము యించుకంత గుట్టు వలె
Language

(॥పల్లవి॥)
ఎంతైనా నాడువారము యించుకంత గుట్టు వలె
పంతమున నొరపులు పట్టవద్దు మమ్మును

(॥ఎంతైనా॥)
యెవ్వతెకు వలతువో యెరఁగము నీ మనసు
నవ్వఁగానెట్టుండునో నడుమంత్రాన
ఇవ్వలనంతే కలితే నేకతానకు రావయ్య
చివ్వన మమ్మీడఁ గాకసేయవద్దు నీవు

(॥ఎంతైనా॥)
యేడయింతిఁ దలఁచితో ఇంపు నీ కెటువలెనో
వీడె మీఁగా నెట్టుండునో వేళెరఁగక
వేడుక నీకుఁ గలితే విడిదికి రావయ్య
వాడలోన రట్టుసేయవద్దు మమ్ము నీవు

(॥ఎంతైనా॥)
యేసతి మీకుఁ జుట్టుమో యెంత గద్దో నీయాస
సేసవెట్టితేనెట్టో సిగ్గువడక
వాసితోడ శ్రీ వేంకటేశ్వర మమ్ము నేలితివి
వేసాలకు మాపైదూరు వేయవద్దు నీవు

(||pallavi||)
ĕṁtainā nāḍuvāramu yiṁchugaṁta guṭṭu valĕ
paṁtamuna nŏrabulu paṭṭavaddu mammunu

(||ĕṁtainā||)
yĕvvadĕgu valaduvo yĕram̐gamu nī manasu
navvam̐gānĕṭṭuṁḍuno naḍumaṁtrāna
ivvalanaṁte kalide negadānagu rāvayya
sivvana mammīḍam̐ gāgaseyavaddu nīvu

(||ĕṁtainā||)
yeḍayiṁtim̐ dalam̐sido iṁpu nī kĕḍuvalĕno
vīḍĕ mīm̐gā nĕṭṭuṁḍuno veḽĕram̐gaga
veḍuga nīgum̐ galide viḍidigi rāvayya
vāḍalona raṭṭuseyavaddu mammu nīvu

(||ĕṁtainā||)
yesadi mīgum̐ juṭṭumo yĕṁta gaddo nīyāsa
sesavĕṭṭidenĕṭṭo sigguvaḍaga
vāsidoḍa śhrī veṁkaḍeśhvara mammu nelidivi
vesālagu mābaidūru veyavaddu nīvu