ఎంతైనా నాతఁడు నీకు నెక్కుడుగాదా
(॥పల్లవి॥)
ఎంతైనా నాతఁడు నీకు నెక్కుడుగాదా
కాంతుఁడు మన్నించఁగానే ఘనురాల వైతివి
(॥॥)
వెక్కసములాడకువే విభునితో సారె సారె
మిక్కిలి నాతఁడు నీకు మేలువాఁడు
జక్కవపిట్టలవంటి చన్నులు విసికెనంటా
వుక్కవంటి గోరనేల వూఁదేవే నీవు
(॥॥)
ఆరితేరి యెంచకువే అండనుండి ఇంతలోనె
చేరి నీకు బ్రియములు చెప్పీ నాతఁడు
తోరపు మొయిలువంటితురు మాతఁ డంటెనంటా
భీరానఁ జేతులు చాఁచి పెనఁగుదురటమే
(॥॥)
నీ వలమేలుమంగవు నిందలు వేయకువే
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ జెందినవాఁడు
ఆవటించి నిన్నుఁగూడి యట్టె చెక్కంటెనంటా
కావరించి నీ వప్పటి ఘాతనేయఁదగునా
(||pallavi||)
ĕṁtainā nādam̐ḍu nīgu nĕkkuḍugādā
kāṁtum̐ḍu manniṁcham̐gāne ghanurāla vaidivi
(||||)
vĕkkasamulāḍaguve vibhunido sārĕ sārĕ
mikkili nādam̐ḍu nīgu meluvām̐ḍu
jakkavabiṭṭalavaṁṭi sannulu visigĕnaṁṭā
vukkavaṁṭi goranela vūm̐deve nīvu
(||||)
ārideri yĕṁchaguve aṁḍanuṁḍi iṁtalonĕ
seri nīgu briyamulu sĕppī nādam̐ḍu
torabu mŏyiluvaṁṭiduru mādam̐ ḍaṁṭĕnaṁṭā
bhīrānam̐ jedulu sām̐si pĕnam̐guduraḍame
(||||)
nī valamelumaṁgavu niṁdalu veyaguve
śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐ jĕṁdinavām̐ḍu
āvaḍiṁchi ninnum̐gūḍi yaṭṭĕ sĕkkaṁṭĕnaṁṭā
kāvariṁchi nī vappaḍi ghādaneyam̐dagunā