(॥పల్లవి॥)
ఎంతైన నీగుణము యేల మానును
చింతతో నీకుఁ బ్రియము చెప్పుదుము గాక
(॥ఎంతైన॥)
కడు నెరదు చూచి మాకన్నులె ఘనము గాక
వడి మాయింటికి నేఁడు వచ్చెవా నీవు
వుడివోనితమకాన వుండజాల కొకమాఁట
అడియాసలనె నిన్ను నాడుదుము గాక
(॥ఎంతైన॥)
నవ్వి నవ్వి యిదె మానడుమె సన్నము గాక
అవ్వలఁ గొంతైన లోనయ్యేవా నీవు
జవ్వనభారముచేత జడిసి నీభ్రమఁ బడి
పువ్వుల పానుపుమీఁద బొరలదుఁ గాక
(॥ఎంతైన॥)
సారె నిన్నుఁ గాఁగిలించి చన్నులె గట్టాయఁ గాక
చేరువ నామేలు దలఁచేవా నీవు
కూరిమి శ్రీవెంకటేశ కూడి నేను తమకించి
యీరీతిని నీ వురమె యెక్కు కొంటిఁ గాక
(||pallavi||)
ĕṁtaina nīguṇamu yela mānunu
siṁtado nīgum̐ briyamu sĕppudumu gāga
(||ĕṁtaina||)
kaḍu nĕradu sūsi māgannulĕ ghanamu gāga
vaḍi māyiṁṭigi nem̐ḍu vachchĕvā nīvu
vuḍivonidamagāna vuṁḍajāla kŏgamām̐ṭa
aḍiyāsalanĕ ninnu nāḍudumu gāga
(||ĕṁtaina||)
navvi navvi yidĕ mānaḍumĕ sannamu gāga
avvalam̐ gŏṁtaina lonayyevā nīvu
javvanabhāramuseda jaḍisi nībhramam̐ baḍi
puvvula pānubumīm̐da bŏraladum̐ gāga
(||ĕṁtaina||)
sārĕ ninnum̐ gām̐giliṁchi sannulĕ gaṭṭāyam̐ gāga
seruva nāmelu dalam̐sevā nīvu
kūrimi śhrīvĕṁkaḍeśha kūḍi nenu tamagiṁchi
yīrīdini nī vuramĕ yĕkku kŏṁṭim̐ gāga