ఎంతైన మా గుణాలు యిటువంటివేకాని
(॥పల్లవి॥)
ఎంతైన మా గుణాలు యిటువంటివేకాని
అంతటి నీ ఘనతే అది యెంచుకొమ్మీ
(॥ఎంతై॥)
తలఁపు నిలువలేక తమకింతుఁగాని నాపైఁ
గలమోహ మెరుఁగుదు ఘనుఁడ నీవు
చెలులము గాన మాకుఁ జెల్లు నేమాటాడిన నీవు
నిలువుగంభీరుఁడవు నీకుఁ బోదుసుమ్మీ
(॥ఎంతై॥)
సంగడి మచ్చరమున సారెఁ గోరుదుఁగాని
అంగపునీమన్నన నే నదెరుఁగుదు
కంగి చందచలాక్షులముగాను మాజాడలవింతే
వండడమైననీవరు నెంచుకొమ్మీ
(॥ఎంతై॥)
చనవున బొమ్మలనేజంకించితిగాక నీ
వెలసినమహిమ నే నెరుఁగుదును
మనువై సరతుల సలయపుమామతి మిది
వోవరి శ్రీవేంకటేశ వొగిఁ దెలుసుకొమ్మీ
(||pallavi||)
ĕṁtaina mā guṇālu yiḍuvaṁṭivegāni
aṁtaḍi nī ghanade adi yĕṁchugŏmmī
(||ĕṁtai||)
talam̐pu niluvalega tamagiṁtum̐gāni nābaim̐
galamoha mĕrum̐gudu ghanum̐ḍa nīvu
sĕlulamu gāna māgum̐ jĕllu nemāḍāḍina nīvu
niluvugaṁbhīrum̐ḍavu nīgum̐ bodusummī
(||ĕṁtai||)
saṁgaḍi machcharamuna sārĕm̐ gorudum̐gāni
aṁgabunīmannana ne nadĕrum̐gudu
kaṁgi saṁdasalākṣhulamugānu mājāḍalaviṁte
vaṁḍaḍamainanīvaru nĕṁchugŏmmī
(||ĕṁtai||)
sanavuna bŏmmalanejaṁkiṁchidigāga nī
vĕlasinamahima ne nĕrum̐gudunu
manuvai saradula salayabumāmadi midi
vovari śhrīveṁkaḍeśha vŏgim̐ dĕlusugŏmmī