Emtagum jaalavu neeviduvamti suddulu

ఎంతకుఁ జాలవు నీవిటువంటి సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఎంతకుఁ జాలవు నీవిటువంటి సుద్దులు
పంతము గొనేవి నీ పనులే కావా

(॥॥)
తలపోఁతలో నుండి తమిరేఁచే వెల్లాను
మలసి నీవాడిన మాటలే కావా
కలలోపలను వచ్చి కరఁగించే వెల్లాను
నలువంక నీ సెలవి నవ్వులే కావా

(॥॥)
గుట్టుతోడ మనసులో గుబ్బతిలే వెల్లాను
చిట్టకపు కొనగోరి సేఁతలే కావా
గట్టిగా నామర్మములు కరఁగించేటి వెల్లాను
బెట్టుగా నీవు మన్నించే ప్రియములే కావా

(॥॥)
పక్కన నాకాఁగిటిలో బ్రమయించే వెల్లాను
గక్కనఁ గూడిన సంభోగములే కావా
మక్కువ శ్రీవేంకటేశ మరచిన వెల్లాను
చిక్కని నీమేని మీఁది సింగారాలే కావా

(||pallavi||)
ĕṁtagum̐ jālavu nīviḍuvaṁṭi suddulu
paṁtamu gŏnevi nī panule kāvā

(||||)
talabom̐talo nuṁḍi tamirem̐se vĕllānu
malasi nīvāḍina māḍale kāvā
kalalobalanu vachchi karam̐giṁche vĕllānu
naluvaṁka nī sĕlavi navvule kāvā

(||||)
guṭṭudoḍa manasulo gubbadile vĕllānu
siṭṭagabu kŏnagori sem̐tale kāvā
gaṭṭigā nāmarmamulu karam̐giṁcheḍi vĕllānu
bĕṭṭugā nīvu manniṁche priyamule kāvā

(||||)
pakkana nāgām̐giḍilo bramayiṁche vĕllānu
gakkanam̐ gūḍina saṁbhogamule kāvā
makkuva śhrīveṁkaḍeśha marasina vĕllānu
sikkani nīmeni mīm̐di siṁgārāle kāvā