Emtagu vachchem banulu yidemayya

ఎంతకు వచ్చెఁ బనులు యిదేమయ్య
Language

(॥పల్లవి॥)
ఎంతకు వచ్చెఁ బనులు యిదేమయ్య
వంతువాసి సవతులవారము గామా

(॥ఎంతకు॥)
చలి దీర నాపె నీవు సరసము లాడఁగాను
నిలిచి కొలువు సేయ నేమా నీకు
అలిగి యెదురు మంచాలందు మీ రెక్కు కుండఁగా
నెలవై సంది మాటాడ నేమా నీకు

(॥ఎంతకు॥)
పువ్వులచెండున మీరు పూఁచి వేట్లాడఁ గాను
నివ్వటిల్ల నందియ్య నేమా నీకు
రవ్వగా జూదము లాడి రతిఁ దిట్లాడఁ గాను
నెవ్వగ దీర మానుప నేమా నీకు

(॥ఎంతకు॥)
యెమ్మెల పంతములు మీ రిద్దరును నాడుకోఁగా
నెమ్మది సాకిరి విన నేమా నీకు
కొమ్మను శ్రీవేంకటేశ కూడిన వెనకఁ గూడి
నిమ్మపం డ్లిచ్చి మొక్క నేమా నీకు

(||pallavi||)
ĕṁtagu vachchĕm̐ banulu yidemayya
vaṁtuvāsi savadulavāramu gāmā

(||ĕṁtagu||)
sali dīra nābĕ nīvu sarasamu lāḍam̐gānu
nilisi kŏluvu seya nemā nīgu
aligi yĕduru maṁchālaṁdu mī rĕkku kuṁḍam̐gā
nĕlavai saṁdi māḍāḍa nemā nīgu

(||ĕṁtagu||)
puvvulasĕṁḍuna mīru pūm̐si veṭlāḍam̐ gānu
nivvaḍilla naṁdiyya nemā nīgu
ravvagā jūdamu lāḍi radim̐ diṭlāḍam̐ gānu
nĕvvaga dīra mānuba nemā nīgu

(||ĕṁtagu||)
yĕmmĕla paṁtamulu mī riddarunu nāḍugom̐gā
nĕmmadi sāgiri vina nemā nīgu
kŏmmanu śhrīveṁkaḍeśha kūḍina vĕnagam̐ gūḍi
nimmabaṁ ḍlichchi mŏkka nemā nīgu