Emtagu vachchem banulu yemi sesugomti nenu

ఎంతకు వచ్చెఁ బనులు యేమి సేసుకొంటి నేను
Language

(॥పల్లవి॥)
ఎంతకు వచ్చెఁ బనులు యేమి సేసుకొంటి నేను
వింతగా నీతోడి పొందు వెక్కసము లాయరా

(॥ఎంత॥)
తనివోక నీమోము తప్ప కిట్టే చూచి చూచి
కనురెప్ప వేయఁబోతే కాఁక రేఁగీనా
మనసిచ్చి నీతోడ మాటలాడి మాటలాడి
కొన నూరకుండఁబోతే గుబ్బతిలీ వలపు

(॥ఎంత॥)
వద్ద నిట్టె కూచుండి వాకిటికి లేచి పోతే
చద్దికి వేఁడికి గుండె జల్లురనీరా
యిద్దర మెదురై వుండి యివ్వలి మోమైతేను
వొద్దనినా మానదు నిట్టూరుపు రేఁగీనా

(॥ఎంత॥)
మచ్చికతో నిన్నుఁ గూడి మంచము దిగేనంటే
చెచ్చెర నాకోరికలు చిమ్మి రేఁచీరా
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నన్ను నేలితివి
పచ్చిగా నీమేలు చూచి బ్రమసితిరా

(||pallavi||)
ĕṁtagu vachchĕm̐ banulu yemi sesugŏṁṭi nenu
viṁtagā nīdoḍi pŏṁdu vĕkkasamu lāyarā

(||ĕṁta||)
tanivoga nīmomu tappa kiṭṭe sūsi sūsi
kanurĕppa veyam̐bode kām̐ka rem̐gīnā
manasichchi nīdoḍa māḍalāḍi māḍalāḍi
kŏna nūraguṁḍam̐bode gubbadilī valabu

(||ĕṁta||)
vadda niṭṭĕ kūsuṁḍi vāgiḍigi lesi pode
saddigi vem̐ḍigi guṁḍĕ jalluranīrā
yiddara mĕdurai vuṁḍi yivvali momaidenu
vŏddaninā mānadu niṭṭūrubu rem̐gīnā

(||ĕṁta||)
machchigado ninnum̐ gūḍi maṁchamu digenaṁṭe
sĕchchĕra nāgorigalu simmi rem̐sīrā
yichchagum̐ḍa śhrīveṁkaḍeśha nannu nelidivi
pachchigā nīmelu sūsi bramasidirā