ఎంతకు నెంతేకాక యెక్కుడేఁటికి
(॥పల్లవి॥)
ఎంతకు నెంతేకాక యెక్కుడేఁటికి
మంతనాన బుద్ది చెప్పి మన్నించరాదా
(॥ఎంత॥)
కన్నుల నీవు చూచితే కామిని యందుకుఁ బతి
చన్నుల నొత్తినదె సరియాయను
సన్నల నింకానేల చలములు సాదించేవు
కిన్నెర యదిగో మీఁటి గిలిగించరాదా
(॥ఎంత॥)
పలుకుల నవ్వితేను పడఁతి యందుకు నీతో
సెలవుల నవ్వినదే సెలవాయను
మలసి యప్పటి నేల మారుకొనఁ దలఁచేవు
వలపు చిత్తరువున వా(వ్రా?) సి చూపరాదా
(॥ఎంత॥)
ముట్టి నీవు చెనకితే మోహము రెట్టించ నాపె
పట్టి పెనఁగినదే బలువాయను
యిట్టె శ్రీ వేంకటేశ యిరవై యిఁకఁ బాయవు
గట్టిగా తలఁపు దీర కప్పుర మీరాదా
(||pallavi||)
ĕṁtagu nĕṁtegāga yĕkkuḍem̐ṭigi
maṁtanāna buddi sĕppi manniṁcharādā
(||ĕṁta||)
kannula nīvu sūside kāmini yaṁdugum̐ badi
sannula nŏttinadĕ sariyāyanu
sannala niṁkānela salamulu sādiṁchevu
kinnĕra yadigo mīm̐ṭi giligiṁcharādā
(||ĕṁta||)
palugula navvidenu paḍam̐ti yaṁdugu nīdo
sĕlavula navvinade sĕlavāyanu
malasi yappaḍi nela mārugŏnam̐ dalam̐sevu
valabu sittaruvuna vā(vrā?) si sūbarādā
(||ĕṁta||)
muṭṭi nīvu sĕnagide mohamu rĕṭṭiṁcha nābĕ
paṭṭi pĕnam̐ginade baluvāyanu
yiṭṭĕ śhrī veṁkaḍeśha yiravai yim̐kam̐ bāyavu
gaṭṭigā talam̐pu dīra kappura mīrādā