ఎంతకు నంతేకాక యెక్కుడేఁటికే
(॥పల్లవి॥)
ఎంతకు నంతేకాక యెక్కుడేఁటికే
పొంతనుండి యాతని బుజ్జగించఁగదవే
(॥ఎంత॥)
పయ్యదకొంగు వట్టితే పతిని జంకించితివి
తియ్యనిమోవిపై మరి తిట్లూ నేలే
వొయ్యనే వలపు చింది వొకటి ఇనుమడాయ
చయ్యాటలు మాని ఇఁక సరసములాడవే
(॥ఎంత॥)
కోరి చన్ను లంటితేను కొనగోర నూఁదితివి
వూరకే మీఁదమిక్కిలి వొట్లేంటికే
పోరచి వయసు వండి పోఁకకుఁ బుట్టెఁడాయ
కేరడాలు మాని ఇట్టే కేలెత్తి మొక్కవే
(॥ఎంత॥)
పక్కన గాఁగిలించితే పాదము పైవేసితవి
చెక్కిటిచేతితోడిసిగ్గు లేఁటికే
యెక్కువైన శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
పెక్కులెల్లా మాని యిట్టె ప్రియములు చెప్పవే
(||pallavi||)
ĕṁtagu naṁtegāga yĕkkuḍem̐ṭige
pŏṁtanuṁḍi yādani bujjagiṁcham̐gadave
(||ĕṁta||)
payyadagŏṁgu vaṭṭide padini jaṁkiṁchidivi
tiyyanimovibai mari tiṭlū nele
vŏyyane valabu siṁdi vŏgaḍi inumaḍāya
sayyāḍalu māni im̐ka sarasamulāḍave
(||ĕṁta||)
kori sannu laṁṭidenu kŏnagora nūm̐didivi
vūrage mīm̐damikkili vŏṭleṁṭige
porasi vayasu vaṁḍi pom̐kagum̐ buṭṭĕm̐ḍāya
keraḍālu māni iṭṭe kelĕtti mŏkkave
(||ĕṁta||)
pakkana gām̐giliṁchide pādamu paivesidavi
sĕkkiḍisedidoḍisiggu lem̐ṭige
yĕkkuvaina śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
pĕkkulĕllā māni yiṭṭĕ priyamulu sĕppave