ఎంతకు నంతేకాక యెక్కుడేలయ్య
(॥పల్లవి॥)
ఎంతకు నంతేకాక యెక్కుడేలయ్య
కాంత సేసేపని సేయఁగలమా నేమయ్యా
(॥ఎంత॥)
మలసి పంతమాడేవు నాతోనే నవ్వేవు
చెలియకు నీమాట చెప్పేమయ్యా
పిలువ వచ్చితి మింతే పెక్కులు నేరము నేము
యెలమి మారుమాటలు యేమనేమయ్యా
(॥ఎంత॥)
భావించి సిగ్గువడేవు పాదాలు గుద్దుమనేవు
వావులు ఆపె నడిగి వచ్చేమయ్యా
పూవులు దెచ్చితి మింతే పొలఁతి యప్పణలేక
సేవసేయ వెరతుము చెప్పిపంపవయ్యా
(॥ఎంత॥)
కరఁగి నీవే చొక్కేవు గక్కనఁ గాఁగిలించేవు
కెరలి యాపెకు నెఱిఁగించేమయ్యా
ఇరవై శ్రీ వేంకటేశ యింతి వచ్చి నిన్నుఁ గూడె
మరిగె నిన్నిటా నిన్ను మన్నించవయ్యా
(||pallavi||)
ĕṁtagu naṁtegāga yĕkkuḍelayya
kāṁta sesebani seyam̐galamā nemayyā
(||ĕṁta||)
malasi paṁtamāḍevu nādone navvevu
sĕliyagu nīmāḍa sĕppemayyā
piluva vachchidi miṁte pĕkkulu neramu nemu
yĕlami mārumāḍalu yemanemayyā
(||ĕṁta||)
bhāviṁchi sigguvaḍevu pādālu guddumanevu
vāvulu ābĕ naḍigi vachchemayyā
pūvulu dĕchchidi miṁte pŏlam̐ti yappaṇalega
sevaseya vĕradumu sĕppibaṁpavayyā
(||ĕṁta||)
karam̐gi nīve sŏkkevu gakkanam̐ gām̐giliṁchevu
kĕrali yābĕgu nĕṟim̐giṁchemayyā
iravai śhrī veṁkaḍeśha yiṁti vachchi ninnum̐ gūḍĕ
marigĕ ninniḍā ninnu manniṁchavayyā