Emtagu namte kaaga yekkudela

ఎంతకు నంతే కాక యెక్కుడేల
Language

(॥పల్లవి॥)
ఎంతకు నంతే కాక యెక్కుడేల
వింతలు నేఁ జేయఁబోతే విసుగకుండేవా

(॥ఎంత॥)
నీటికొలఁదే తామెర నీ వేల మమ్ముఁ దిట్టేవు
మాట నీ వాడినంతే మామారుమాట
గాఁటమై నే నూరఁ గలకతలు నీతో నాడితే
యేఁటికి మాతో నిది యేల పేలి ననవా

(॥ఎంత॥)
బలుపుకొద్దే పంతము పదర నేఁటికి నీవు
చలి వాపినంతే నీతో సరసము
యెలమి నింతకంటె నెక్కుఁడు నవ్వఁగఁబోతే
తిలకించి పట్టకాదు దీనిగర్వ మనవా

(॥ఎంత॥)
లోఁతుకొలదే పాఁతు లోన నేల జంకించేవు
చేఁత నీవు సేసినంతే చేరి మాపొందు
ఈఁతగాఁ గూడితి నన్ను నిట్టి శ్రీవేంకటేశ
మోఁతతో నేఁ గొరితే ముందే అలయవా

(||pallavi||)
ĕṁtagu naṁte kāga yĕkkuḍela
viṁtalu nem̐ jeyam̐bode visugaguṁḍevā

(||ĕṁta||)
nīḍigŏlam̐de tāmĕra nī vela mammum̐ diṭṭevu
māḍa nī vāḍinaṁte māmārumāḍa
gām̐ṭamai ne nūram̐ galagadalu nīdo nāḍide
yem̐ṭigi mādo nidi yela peli nanavā

(||ĕṁta||)
balubugŏdde paṁtamu padara nem̐ṭigi nīvu
sali vābinaṁte nīdo sarasamu
yĕlami niṁtagaṁṭĕ nĕkkum̐ḍu navvam̐gam̐bode
tilagiṁchi paṭṭagādu dīnigarva manavā

(||ĕṁta||)
lom̐tugŏlade pām̐tu lona nela jaṁkiṁchevu
sem̐ta nīvu sesinaṁte seri mābŏṁdu
īm̐tagām̐ gūḍidi nannu niṭṭi śhrīveṁkaḍeśha
mom̐tado nem̐ gŏride muṁde alayavā