ఎంతగోస నాస సేసేవేల మమ్ముఁ గొసరేవు
(॥పల్లవి॥)
ఎంతగోస నాస సేసేవేల మమ్ముఁ గొసరేవు
పంతము నీ కిచ్చినదే పైకొంటగాదా
(॥॥)
యెదిరించి నీకుఁ జేతులెత్తి మొక్కినపుడే
కొదలేక నిన్ను వేఁడుకొంటగాదా
పొదిగి మేపొద్దు నీపొంత నున్నయపుడే
అదనఁ గూడుకొని నీయాల నౌటగాదా
(॥॥)
కనుఁగొని కొలువులోఁ గాను కిచ్చినపుడే
చెనకి నీకుఁ బ్రియాలు చెప్పుటగాదా
ననుపుతో సెలవుల నవ్వునవ్వినప్పుడే
యెనసేననుచునీతో నియ్యకొంటగాదా
(॥॥)
మచ్చిక నీచెవిలోన మాటలాడినపుడే
కొచ్చికొచ్చి నీకాఁగిటఁ గూడుటగాదా
అచ్చపు శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
మెచ్చి నీరతిఁజొక్కితి మేలుదానఁ గాదా
(||pallavi||)
ĕṁtagosa nāsa sesevela mammum̐ gŏsarevu
paṁtamu nī kichchinade paigŏṁṭagādā
(||||)
yĕdiriṁchi nīgum̐ jedulĕtti mŏkkinabuḍe
kŏdalega ninnu vem̐ḍugŏṁṭagādā
pŏdigi mebŏddu nībŏṁta nunnayabuḍe
adanam̐ gūḍugŏni nīyāla nauḍagādā
(||||)
kanum̐gŏni kŏluvulom̐ gānu kichchinabuḍe
sĕnagi nīgum̐ briyālu sĕppuḍagādā
nanubudo sĕlavula navvunavvinappuḍe
yĕnasenanusunīdo niyyagŏṁṭagādā
(||||)
machchiga nīsĕvilona māḍalāḍinabuḍe
kŏchchigŏchchi nīgām̐giḍam̐ gūḍuḍagādā
achchabu śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
mĕchchi nīradim̐jŏkkidi meludānam̐ gādā