Emtagemtasesevu yemmeleedanu

ఎంతకెంతసేసేవు యెమ్మెలీడను
Language

(॥పల్లవి॥)
ఎంతకెంతసేసేవు యెమ్మెలీడను
పంతము చెల్లినమీఁద పాలార్చఁ దగదా

(॥ఎంత॥)
సిగ్గుపడి వున్నాపెను సెలవి నవ్వుదురా
దగ్గరి పైఁ జేయివేయఁదగుఁగాక
కగ్గుదేరీఁ గెమ్మోవి కాటుకకన్నుల మొక్కి
తగ్గక నీ చిత్తములో దయవుట్టదగదా

(॥ఎంత॥)
వనాపతి అయినాపను మన సోదింతురా
ఆనుకొని మెచ్చఁదగవౌఁగాక
నానెఁజెమటల మేను ననలొత్తెఁ బులకలు
తానకమై మతిలోన దయవుట్టదగదా

(॥ఎంత॥)
చేరి కాఁగలించినాపెఁ జిక్కించి కొసరుదురా
కోరికెలు మీరనిట్టె కూడుతగాక
మేరతో శ్రీవేంకటేశ మెలుఁత నిన్నునెనసీ
తారుకాణ నీరీతినే దయవుట్టఁదగదా

(||pallavi||)
ĕṁtagĕṁtasesevu yĕmmĕlīḍanu
paṁtamu sĕllinamīm̐da pālārsam̐ dagadā

(||ĕṁta||)
siggubaḍi vunnābĕnu sĕlavi navvudurā
daggari paim̐ jeyiveyam̐dagum̐gāga
kagguderīm̐ gĕmmovi kāḍugagannula mŏkki
taggaga nī sittamulo dayavuṭṭadagadā

(||ĕṁta||)
vanābadi ayinābanu mana sodiṁturā
ānugŏni mĕchcham̐dagavaum̐gāga
nānĕm̐jĕmaḍala menu nanalŏttĕm̐ bulagalu
tānagamai madilona dayavuṭṭadagadā

(||ĕṁta||)
seri kām̐galiṁchinābĕm̐ jikkiṁchi kŏsarudurā
korigĕlu mīraniṭṭĕ kūḍudagāga
merado śhrīveṁkaḍeśha mĕlum̐ta ninnunĕnasī
tārugāṇa nīrīdine dayavuṭṭam̐dagadā