(॥పల్లవి॥)
ఎంతకెంత సేసేవు యేమే నీవు
సంతోసాన నీ వాతని చనవు చేకొనవే
(॥ఎంత॥)
చుట్టరికము లాతఁడు చూపి మోపీఁజెప్పఁగానే
ముట్టకుమంటావేల మొక్కు మొక్కేవే
నెట్టుకొని యాసతోడ నీ మొగము చూడఁగానే
దిట్టతనమున నేల తెరవేసుకొనేవే
(॥ఎంత॥)
వొడివట్టుకొని పతి వొడఁబరచుకోఁగానే
విడిపించుకోరా కెంత వేఁడుకొనేవే
తడయక నీ నోరిలోఁ దమ్ములము వెట్టఁగానే
చిడుముడి నివేల చేయి చాఁచేవే
(॥ఎంత॥)
యెనసి శ్రీవేంకటేశుఁ డిక్కువ లంటఁగానే
చెనకనియ్యక యాల చెక్కు నొక్కేవే
పెనఁగి రతుల నీకుఁ బ్రియములు చెప్పఁగానే
ననిచి సిగ్గుల నేల నవ్వి కాఁగిలించేవే
(||pallavi||)
ĕṁtagĕṁta sesevu yeme nīvu
saṁtosāna nī vādani sanavu segŏnave
(||ĕṁta||)
suṭṭarigamu lādam̐ḍu sūbi mobīm̐jĕppam̐gāne
muṭṭagumaṁṭāvela mŏkku mŏkkeve
nĕṭṭugŏni yāsadoḍa nī mŏgamu sūḍam̐gāne
diṭṭadanamuna nela tĕravesugŏneve
(||ĕṁta||)
vŏḍivaṭṭugŏni padi vŏḍam̐barasugom̐gāne
viḍibiṁchugorā kĕṁta vem̐ḍugŏneve
taḍayaga nī norilom̐ dammulamu vĕṭṭam̐gāne
siḍumuḍi nivela seyi sām̐seve
(||ĕṁta||)
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍikkuva laṁṭam̐gāne
sĕnaganiyyaga yāla sĕkku nŏkkeve
pĕnam̐gi radula nīgum̐ briyamulu sĕppam̐gāne
nanisi siggula nela navvi kām̐giliṁcheve