(॥పల్లవి॥)
ఎంతకెంత సేసేవు ఇది యేమే
ఇంతగాఁ గొసరుదురా ఇది యేమే
(॥ఎంత॥)
ఇచ్చకములాడేపతి నెగసక్కెములాడేవు
హెచ్చి జవ్వనమదాన నిదియేమే
మెచ్చులాతఁడు మెచ్చఁగా మేకులు పచరించేవు
యిచ్చిన చనవునను నిది యేమే
(॥ఎంత॥)
మంతనాలు చెప్పఁగాను మలయుచుఁ బెనఁగేవు
యింతులలోపలనెల్లా నిదియేమే
వింతలుగా నవ్వఁగాను వెస గుట్టు సేసేవు
యెంతయినాఁ గరఁగవు యిదియేమే
(॥ఎంత॥)
అంగవించి కూడఁగాను అలసేవు పానుపుపై
యెంగిలిమోవితోడ నిదియేమే
రంగు శ్రీవేంకటేశుఁడు రతి సేసితే మొక్కేవు
యింగిత మెఱుఁగుదువు యిది యేమే
(||pallavi||)
ĕṁtagĕṁta sesevu idi yeme
iṁtagām̐ gŏsarudurā idi yeme
(||ĕṁta||)
ichchagamulāḍebadi nĕgasakkĕmulāḍevu
hĕchchi javvanamadāna nidiyeme
mĕchchulādam̐ḍu mĕchcham̐gā megulu pasariṁchevu
yichchina sanavunanu nidi yeme
(||ĕṁta||)
maṁtanālu sĕppam̐gānu malayusum̐ bĕnam̐gevu
yiṁtulalobalanĕllā nidiyeme
viṁtalugā navvam̐gānu vĕsa guṭṭu sesevu
yĕṁtayinām̐ garam̐gavu yidiyeme
(||ĕṁta||)
aṁgaviṁchi kūḍam̐gānu alasevu pānububai
yĕṁgilimovidoḍa nidiyeme
raṁgu śhrīveṁkaḍeśhum̐ḍu radi seside mŏkkevu
yiṁgida mĕṟum̐guduvu yidi yeme