Emtagemta pemcheve yemdaamkaanu

ఎంతకెంత పెంచేవే యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఎంతకెంత పెంచేవే యెందాఁకాను
కాంతలకుఁ బతులకుఁ గలదేకాదా

(॥ఎంత॥)
వొట్టువెట్టుకొంటినంటా వూరకే మాటాడవు
పట్టినదే వ్రతమా పడఁతులకు
మెట్టిపట్టుకొని నీతో మేనవావి సేసుకొని
తిట్టెఁ గాక కోపాన సాదించవచ్చెనా

(॥ఎంత॥)
ఆడనలిగినంటా నట్టె శిరసు వంచేవు
ఆడినవే ఆటలా యతివలకు
వేడుక వుట్టవలసి విభుఁడు జూజాన నిన్ను-
నోడించెఁగాక నీతో వొరటువాఁడా

(॥ఎంత॥)
చెల్లుబడిగలదంటా సిగ్గులువడే విప్పుడు
పల్లదమే పగటా భామిసులకు
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డెనసె నిన్నింతలోనె
వుల్లము చూచెఁగాక వొకరీతి నుండెనా

(||pallavi||)
ĕṁtagĕṁta pĕṁcheve yĕṁdām̐kānu
kāṁtalagum̐ badulagum̐ galadegādā

(||ĕṁta||)
vŏṭṭuvĕṭṭugŏṁṭinaṁṭā vūrage māḍāḍavu
paṭṭinade vradamā paḍam̐tulagu
mĕṭṭibaṭṭugŏni nīdo menavāvi sesugŏni
tiṭṭĕm̐ gāga kobāna sādiṁchavachchĕnā

(||ĕṁta||)
āḍanaliginaṁṭā naṭṭĕ śhirasu vaṁchevu
āḍinave āḍalā yadivalagu
veḍuga vuṭṭavalasi vibhum̐ḍu jūjāna ninnu-
noḍiṁchĕm̐gāga nīdo vŏraḍuvām̐ḍā

(||ĕṁta||)
sĕllubaḍigaladaṁṭā sigguluvaḍe vippuḍu
palladame pagaḍā bhāmisulagu
yillidĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ninniṁtalonĕ
vullamu sūsĕm̐gāga vŏgarīdi nuṁḍĕnā