ఎంతకెంత జాణతనా లిఁకనైనాను
(॥పల్లవి॥)
ఎంతకెంత జాణతనా లిఁకనైనాను
యింత చాలదా మన కిఁకనైనాను
(॥ఎంత॥)
బొమ్మల జంకించఁబోతే బొట్టు కస్తూరెల్ల రాలె
యెమ్మెలు మానవే నాతో నిఁకనైనాను
పిమ్మట గొణఁగఁబోతే పెదవికెంపులు రాఁగె
ఇమ్ముల నొక్కటిగారే ఇఁకనైనను
(॥ఎంత॥)
తప్పకచూడఁగఁబోతే తనువెల్లఁ జెమరించె
యెప్పటివలె నుండవే ఇఁకనైనాను
గొప్పగా నవ్వఁగఁబోతే కొప్పు గడువెడజారె
యిప్పటిబింకాలు వద్దే యిఁకనైనాను
(॥ఎంత॥)
ముందటఁ దిట్టఁగఁబోతే మొగమోటములు నిండె
ఇందు కేమిసేసేవే ఇఁకనైనను
అందమైన శ్రీవేంకటప్పఁడని నన్ను
యెందునుఁ బాయపు గూడి యిఁకనైనను
(||pallavi||)
ĕṁtagĕṁta jāṇadanā lim̐kanainānu
yiṁta sāladā mana kim̐kanainānu
(||ĕṁta||)
bŏmmala jaṁkiṁcham̐bode bŏṭṭu kastūrĕlla rālĕ
yĕmmĕlu mānave nādo nim̐kanainānu
pimmaḍa gŏṇam̐gam̐bode pĕdavigĕṁpulu rām̐gĕ
immula nŏkkaḍigāre im̐kanainanu
(||ĕṁta||)
tappagasūḍam̐gam̐bode tanuvĕllam̐ jĕmariṁchĕ
yĕppaḍivalĕ nuṁḍave im̐kanainānu
gŏppagā navvam̐gam̐bode kŏppu gaḍuvĕḍajārĕ
yippaḍibiṁkālu vadde yim̐kanainānu
(||ĕṁta||)
muṁdaḍam̐ diṭṭam̐gam̐bode mŏgamoḍamulu niṁḍĕ
iṁdu kemiseseve im̐kanainanu
aṁdamaina śhrīveṁkaḍappam̐ḍani nannu
yĕṁdunum̐ bāyabu gūḍi yim̐kanainanu