Emtagaddo nee yaasoda mippu deegegu

ఎంతగద్దో నీ యాసోద మిప్పు డీకెకు
Language

(॥పల్లవి॥)
ఎంతగద్దో నీ యాసోద మిప్పు డీకెకు
చింతదీర మనసులో చిక్కు వాపరాదా

(॥॥)
ననుపున నొకమాఁటు నాతో మాటాడితివంటా
గునిసీ తప్పకచూచి కోమలి నిన్ను
పనివడి నీవాపెతో పచ్చిమాటలెల్లా నాడి
వెనకటిగజరెల్లా విడిపంచరాదా

(॥॥)
సమ్మతి నామోము చూచి సరసమాడితివంటా
వుమ్మడిఁ జన్నుల నొత్తీ నువిద నిన్ను
చిమ్ముచు నీకొనగోర జీరలు మేనెల్లాఁ జేసి
దిమ్మురేఁగినమదము తెలుపఁగరాదా

(॥॥)
నవ్వుతా నప్పటి నీవు నన్నుఁ గూడితివంటా
రవ్వగా తాఁ గాఁగిలించీ రతికి నిన్ను
యివ్వల శ్రీ వేంకటేశ యెదురుగా నాపెఁ బెట్టి
కువ్వలై నకూటముల గుదిగుచ్చరాదా

(||pallavi||)
ĕṁtagaddo nī yāsoda mippu ḍīgĕgu
siṁtadīra manasulo sikku vābarādā

(||||)
nanubuna nŏgamām̐ṭu nādo māḍāḍidivaṁṭā
gunisī tappagasūsi komali ninnu
panivaḍi nīvābĕdo pachchimāḍalĕllā nāḍi
vĕnagaḍigajarĕllā viḍibaṁcharādā

(||||)
sammadi nāmomu sūsi sarasamāḍidivaṁṭā
vummaḍim̐ jannula nŏttī nuvida ninnu
simmusu nīgŏnagora jīralu menĕllām̐ jesi
dimmurem̐ginamadamu tĕlubam̐garādā

(||||)
navvudā nappaḍi nīvu nannum̐ gūḍidivaṁṭā
ravvagā tām̐ gām̐giliṁchī radigi ninnu
yivvala śhrī veṁkaḍeśha yĕdurugā nābĕm̐ bĕṭṭi
kuvvalai nagūḍamula gudiguchcharādā