ఎంతగబ్బి ఇదియని యేల తిట్టేవు
(॥పల్లవి॥)
ఎంతగబ్బి ఇదియని యేల తిట్టేవు
మంతనాన నీ కది మంచిదేకాదా
(॥ఎంత॥)
చనవు లొసఁగితేను జవ్వనులు మానుదురా
గొనకొని రమణునిఁ గొసరక
తనువులు సోఁకితేను తమకించకుండుదురా
పెనఁగులాడుతాను ప్రియములు చూపరా
(॥ఎంత॥)
సేసవెట్టి పెండ్లాడితే సిగ్గుతోనే వుందురా
వాసులువంతులుఁ జూపి వలపించక
ఆస నీవు గొలిపితే అట్టె పైకొనకుందురా
రాసికెక్క పచారించి రవ్వసేయక
(॥ఎంత॥)
మరిగించి కూడితేను మట్టుతో నుండుదురా
సరసములాడి మోవి చవిచూపక
ఇరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
సిరులఁ గూడితి వాపెచెల్లె లూరకుండునా
(||pallavi||)
ĕṁtagabbi idiyani yela tiṭṭevu
maṁtanāna nī kadi maṁchidegādā
(||ĕṁta||)
sanavu lŏsam̐gidenu javvanulu mānudurā
gŏnagŏni ramaṇunim̐ gŏsaraga
tanuvulu som̐kidenu tamagiṁchaguṁḍudurā
pĕnam̐gulāḍudānu priyamulu sūbarā
(||ĕṁta||)
sesavĕṭṭi pĕṁḍlāḍide siggudone vuṁdurā
vāsuluvaṁtulum̐ jūbi valabiṁchaga
āsa nīvu gŏlibide aṭṭĕ paigŏnaguṁdurā
rāsigĕkka pasāriṁchi ravvaseyaga
(||ĕṁta||)
marigiṁchi kūḍidenu maṭṭudo nuṁḍudurā
sarasamulāḍi movi savisūbaga
iravai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
sirulam̐ gūḍidi vābĕsĕllĕ lūraguṁḍunā