(॥పల్లవి॥)
ఎంతగాలమొకదా యీ దేహధారణము
చింతాపరంపరలఁ జిక్కువడవలసె
(॥ఎంత॥)
పడిగొన్న మోహంబువలలఁ దగులైకదా
కడలేని గర్భనరకము లీఁదవలనె
నడిమిసుఖములచేత ననుపుసేయఁగఁగదా
తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలనె
(॥ఎంత॥)
పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా
ఆపదల తోడిదేహము మోవవలనె
చూపులకులోనైన సుఖము గానక కదా
దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలనె
(॥ఎంత॥)
హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా
పత్రిలేని నరకకూపమునఁ బడవలనె
అతనికరుణారసంబబ్బ కుండఁగఁగదా
బతిమాలి నలుగడలఁ బారాడవలనె
(||pallavi||)
ĕṁtagālamŏgadā yī dehadhāraṇamu
siṁtābaraṁparalam̐ jikkuvaḍavalasĕ
(||ĕṁta||)
paḍigŏnna mohaṁbuvalalam̐ dagulaigadā
kaḍaleni garbhanaragamu līm̐davalanĕ
naḍimisukhamulaseda nanubuseyam̐gam̐gadā
tŏḍari heyabudiḍḍim̐ dūrāḍavalanĕ
(||ĕṁta||)
pābabuṁjamulasem̐ baṭṭuvaḍam̐gām̐gadā
ābadala toḍidehamu movavalanĕ
sūbulagulonaina sukhamu gānaga kadā
dībanabhrāṁtisem̐ dirigāḍavalanĕ
(||ĕṁta||)
hidum̐ḍaina tiruveṁkaḍeśhum̐ gŏluvagakadā
patrileni naragagūbamunam̐ baḍavalanĕ
adanigaruṇārasaṁbabba kuṁḍam̐gam̐gadā
badimāli nalugaḍalam̐ bārāḍavalanĕ