Emtagaalambainam dappadu yevvarigi nemanamga vachchunu

ఎంతగాలంబైనఁ దప్పదు యెవ్వరికి నేమనఁగ వచ్చును
Language

(॥పల్లవి॥)
ఎంతగాలంబైనఁ దప్పదు యెవ్వరికి నేమనఁగ వచ్చును
దొంతికడవలలోని కొలుచులు తొలుత పుణ్యములు

(॥ఎంత॥)
కలిమి గలదని వుబ్బ వలవదు కడఁగి లేదని సగ్గ వలవదు
కలసి కలలోఁ గన్న సుఖదుఃఖముల చందములు
వలనుగా రాట్నంపు గుండ్రలవరుస లీ జన్మంబు లెల్లను
చెలఁగి దైవము మున్నె సృష్టించినది యీవిధము

(॥ఎంత॥)
నేరనని దైన్యం బదేటికి నేర్తు నని గర్వం బదేటికి
నారుకొను వడగండ్లగుళ్లవి నమ్మనే రాదు
కోరి మనసునఁ బాలు దాగినగుఱుతు లీ భోగంబు లెల్లను
వారివారికి నాత్మగుణములు వసుధ నిలిచినవి

(॥ఎంత॥)
పెద్దదొర నని మీఱఁ దగదు పేద నని తా దాఁగఁదగదు
పొద్దువొద్దును చంద్రబింబముపోల్కి వెలసినది
అద్దుకొని శ్రీవేంకటేశ్వరుఁ డన్నిటికిఁ దను నేలి కావఁగ
బుద్ధి యెఱుఁగుచు లోకపూజ్యతఁ బొసఁగుటే శుభము

(||pallavi||)
ĕṁtagālaṁbainam̐ dappadu yĕvvarigi nemanam̐ga vachchunu
dŏṁtigaḍavalaloni kŏlusulu tŏluda puṇyamulu

(||ĕṁta||)
kalimi galadani vubba valavadu kaḍam̐gi ledani sagga valavadu
kalasi kalalom̐ ganna sukhaduḥkhamula saṁdamulu
valanugā rāṭnaṁpu guṁḍralavarusa lī janmaṁbu lĕllanu
sĕlam̐gi daivamu munnĕ sṛṣhṭiṁchinadi yīvidhamu

(||ĕṁta||)
neranani dainyaṁ badeḍigi nerdu nani garvaṁ badeḍigi
nārugŏnu vaḍagaṁḍlaguḽlavi nammane rādu
kori manasunam̐ bālu dāginaguṟudu lī bhogaṁbu lĕllanu
vārivārigi nātmaguṇamulu vasudha nilisinavi

(||ĕṁta||)
pĕddadŏra nani mīṟam̐ dagadu peda nani tā dām̐gam̐dagadu
pŏdduvŏddunu saṁdrabiṁbamubolgi vĕlasinadi
addugŏni śhrīveṁkaḍeśhvarum̐ ḍanniḍigim̐ danu neli kāvam̐ga
buddhi yĕṟum̐gusu logabūjyadam̐ bŏsam̐guḍe śhubhamu