ఎంతటివాఁడవు నిన్ను నేమిచెప్పేది
(॥పల్లవి॥)
ఎంతటివాఁడవు నిన్ను నేమిచెప్పేది
కంతుని తండ్రివౌట కంటిమి నేమెల్లాను
(॥॥)
తేనేలు వంటిమాటలు తివిరి నీవాడఁగాను
ఆనుకొని వలచిరి యతివలెల్లాను
మోనముతోఁ బొరుగున మొక్కులు చేత మొక్కఁగ
మానలేక తగిలిరి మగనాండ్లెల్లను
(॥॥)
జోడుగాఁ దరితీపుల చూపులు నీవు చూడఁగ
వేడుకతోఁ బైకొనిరి వెలయాండ్లు
వాడి కెనవ్వులు నీవు వరుసతో నవ్వఁగాను
ఆడానీడాఁ బొందిరి పాయపుకన్నెలెల్లాను
(॥॥)
సేయరానిమంతనపు సేఁతలెల్లాఁ జేయఁగాను
ఆయ మెఱిఁగి పెండ్లాడి రచ్చరలెల్లా
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
డాయఁ గొలిచేరు నీపట్టపుదేవుళ్ళెల్లను
(||pallavi||)
ĕṁtaḍivām̐ḍavu ninnu nemisĕppedi
kaṁtuni taṁḍrivauḍa kaṁṭimi nemĕllānu
(||||)
tenelu vaṁṭimāḍalu tiviri nīvāḍam̐gānu
ānugŏni valasiri yadivalĕllānu
monamudom̐ bŏruguna mŏkkulu seda mŏkkam̐ga
mānalega tagiliri maganāṁḍlĕllanu
(||||)
joḍugām̐ daridībula sūbulu nīvu sūḍam̐ga
veḍugadom̐ baigŏniri vĕlayāṁḍlu
vāḍi kĕnavvulu nīvu varusado navvam̐gānu
āḍānīḍām̐ bŏṁdiri pāyabugannĕlĕllānu
(||||)
seyarānimaṁtanabu sem̐talĕllām̐ jeyam̐gānu
āya mĕṟim̐gi pĕṁḍlāḍi rachcharalĕllā
yīyĕḍa śhrīveṁkaḍeśha yelidivi mammu niṭṭĕ
ḍāyam̐ gŏliseru nībaṭṭabudevuḽḽĕllanu