Emtadivaamdavu ninnu nemani nudimtunu

ఎంతటివాఁడవు నిన్ను నేమని నుతింతును
Language

(॥పల్లవి॥)
ఎంతటివాఁడవు నిన్ను నేమని నుతింతును
చింతలు నీ కమరకుండఁగా విచారించే నేను

(॥ఎంతటి॥)
పాలసముద్రములోనఁ బవళించివుండే నీకు
బాలుఁడవైతేనే వెన్న బాఁతాయెనా
కాలమెల్లను శ్రీకాంత కౌఁగిటనుండే నీకు
గోలవైతే గొల్లెతలఁ గడ వేడు కాయెనా

(॥ఎంతటి॥)
పరమపదమునందు బ్రహ్మమై వుండే నీకు
పెరిగి రేపల్లె నాడఁ బ్రియమాయెనా
సురల నెల్లాఁ గావ సులభుండవైన నీకు
గరిమెతోడఁ బసులఁ గాన వేడు కాయెనా

(॥ఎంతటి॥)
యేపొద్దు నిత్యముక్తుల నెనసివుండే నీకు
గోపాలులతోఁ గూడుండఁ గోరి కాయెనా
బాపురే యలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర
యేపొద్దు నిట్టి లీలలె యితవాయెనా

(||pallavi||)
ĕṁtaḍivām̐ḍavu ninnu nemani nudiṁtunu
siṁtalu nī kamaraguṁḍam̐gā visāriṁche nenu

(||ĕṁtaḍi||)
pālasamudramulonam̐ bavaḽiṁchivuṁḍe nīgu
bālum̐ḍavaidene vĕnna bām̐tāyĕnā
kālamĕllanu śhrīgāṁta kaum̐giḍanuṁḍe nīgu
golavaide gŏllĕdalam̐ gaḍa veḍu kāyĕnā

(||ĕṁtaḍi||)
paramabadamunaṁdu brahmamai vuṁḍe nīgu
pĕrigi reballĕ nāḍam̐ briyamāyĕnā
surala nĕllām̐ gāva sulabhuṁḍavaina nīgu
garimĕdoḍam̐ basulam̐ gāna veḍu kāyĕnā

(||ĕṁtaḍi||)
yebŏddu nityamuktula nĕnasivuṁḍe nīgu
gobāluladom̐ gūḍuṁḍam̐ gori kāyĕnā
bābure yalamelmaṁgabadi śhrīveṁkaḍeśhvara
yebŏddu niṭṭi līlalĕ yidavāyĕnā