Emtadivaamdavu neevu yemani mettumu ninnu

ఎంతటివాఁడవు నీవు యేమని మెత్తుము నిన్ను
Language

(॥పల్లవి॥)
ఎంతటివాఁడవు నీవు యేమని మెత్తుము నిన్ను
పంతములు చెల్లించి పైకొంటివి నన్నును

(॥ఎంత॥)
సన్నసేయవచ్చుఁగాక సంగతికి వచ్చితేను
యెన్నికతోడుతఁ జనవియ్యవచ్చునా
పన్ని నవ్వవచ్చుఁగాక పైకొని పెనఁగితేను
నిన్నువలెఁ కూరిములు నించవచ్చునా

(॥ఎంత॥)
పొందు సేయవచ్చుఁగాక పొంతనుండి మొక్కితేను
చెంది చెప్పినట్టెల్లాను సేయవచ్చునా
అందుకొనవచ్చుఁగాక అట్టె వీడెమిచ్చితేను
యిందే నీవలెను మోవియ్యవచ్చునా

(॥ఎంత॥)
చేయి వేయవచ్చుఁగాక చేరి కాఁగిలించుకొంటే
ఆయములంటుతు కలయఁగవచ్చునా
యీయెడ శ్రీవేంకటేశ ఇట్టె నన్ను నేలితివి
నాయమెరిఁగి నీవలె నమ్మించవచ్చునా

(||pallavi||)
ĕṁtaḍivām̐ḍavu nīvu yemani mĕttumu ninnu
paṁtamulu sĕlliṁchi paigŏṁṭivi nannunu

(||ĕṁta||)
sannaseyavachchum̐gāga saṁgadigi vachchidenu
yĕnnigadoḍudam̐ janaviyyavachchunā
panni navvavachchum̐gāga paigŏni pĕnam̐gidenu
ninnuvalĕm̐ kūrimulu niṁchavachchunā

(||ĕṁta||)
pŏṁdu seyavachchum̐gāga pŏṁtanuṁḍi mŏkkidenu
sĕṁdi sĕppinaṭṭĕllānu seyavachchunā
aṁdugŏnavachchum̐gāga aṭṭĕ vīḍĕmichchidenu
yiṁde nīvalĕnu moviyyavachchunā

(||ĕṁta||)
seyi veyavachchum̐gāga seri kām̐giliṁchugŏṁṭe
āyamulaṁṭudu kalayam̐gavachchunā
yīyĕḍa śhrīveṁkaḍeśha iṭṭĕ nannu nelidivi
nāyamĕrim̐gi nīvalĕ nammiṁchavachchunā