Emtadidi nee yaasoda memi seppedi

ఎంతటిది నీ యాసోద మేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంతటిది నీ యాసోద మేమి చెప్పేది
వింతలుగా నవ్వేవు వెలఁదులతోడను

(॥ఎంతటి॥)
రాచిలుకపలుకుల రవళితోడి కొమ్మ
వూచినతంగేడువంటి పుత్తడిబొమ్మ
యేచి నీవురముమీఁద నిట్లానే వుండఁగాను
చాఁచేవు చేతులప్పటి జవరాండ్లమీఁదను

(॥ఎంతటి॥)
కదలుఁజూపుల తేఁటిగతి కన్నుల కలికి
పొదలిన రతిరాజు పూవుములికి
మెదలుచు నేపొద్దు నీమెడదఁడై వుండఁగాను
గుదిగొన నంటేవు గొల్లెతల చన్నులు

(॥ఎంతటి॥)
కారుమెఱుఁగులవంటి కళల చంద్రవదన
గారాపు సింగారాల పంకజసదన
యీరీతి శ్రీవేంకటేశ యీ నీకాఁగిటఁ గూడఁగా
చేరి యేలేవు మావంటి చెలుల నందరిని

(||pallavi||)
ĕṁtaḍidi nī yāsoda memi sĕppedi
viṁtalugā navvevu vĕlam̐duladoḍanu

(||ĕṁtaḍi||)
rāsilugabalugula ravaḽidoḍi kŏmma
vūsinadaṁgeḍuvaṁṭi puttaḍibŏmma
yesi nīvuramumīm̐da niṭlāne vuṁḍam̐gānu
sām̐sevu sedulappaḍi javarāṁḍlamīm̐danu

(||ĕṁtaḍi||)
kadalum̐jūbula tem̐ṭigadi kannula kaligi
pŏdalina radirāju pūvumuligi
mĕdalusu nebŏddu nīmĕḍadam̐ḍai vuṁḍam̐gānu
gudigŏna naṁṭevu gŏllĕdala sannulu

(||ĕṁtaḍi||)
kārumĕṟum̐gulavaṁṭi kaḽala saṁdravadana
gārābu siṁgārāla paṁkajasadana
yīrīdi śhrīveṁkaḍeśha yī nīgām̐giḍam̐ gūḍam̐gā
seri yelevu māvaṁṭi sĕlula naṁdarini