Emtadidaanavu neevu yemi seppemu

ఎంతటిదానవు నీవు యేమి చెప్పేము
Language

(॥పల్లవి॥)
ఎంతటిదానవు నీవు యేమి చెప్పేము
పంతము లన్నియు దక్కెఁ బలుకు లీడేరెను

(॥ఎంతటి॥)
చింత లెల్లఁ బెడబాసె చెక్కుచెయి దియ్యవమ్మ
కాంతుఁ డింటికి విచ్చేసె కడమ దీరె
దొంతి నున్నవలపులు తొడికితేఁ జేతఁ జిక్కె
యింతయు నీ మహిమలె యిఁక నేల జాగులు

(॥ఎంతటి॥)
కోరికలు సమకూడె గోరివాఁత మానవమ్మ
గారవించె నాతఁడు నీ కైవస మాయ
చేరినట్టె జవ్వనము చెల్లుబడి కెక్కె నిదె
నేరు పెల్ల నీ సొమ్మె నీ కేల మరఁగు

(॥ఎంతటి॥)
తతి వచ్చె కూటమికి తలవంచ నేలమ్మ
అతఁడు శ్రీవెంకటేశుఁ డంకెం గలసె
మతిలోని ముదములు మాటలసోన గురిసె
చతురత నీ పాలాయ సంకేల నీకును

(||pallavi||)
ĕṁtaḍidānavu nīvu yemi sĕppemu
paṁtamu lanniyu dakkĕm̐ balugu līḍerĕnu

(||ĕṁtaḍi||)
siṁta lĕllam̐ bĕḍabāsĕ sĕkkusĕyi diyyavamma
kāṁtum̐ ḍiṁṭigi vichchesĕ kaḍama dīrĕ
dŏṁti nunnavalabulu tŏḍigidem̐ jedam̐ jikkĕ
yiṁtayu nī mahimalĕ yim̐ka nela jāgulu

(||ĕṁtaḍi||)
korigalu samagūḍĕ gorivām̐ta mānavamma
gāraviṁchĕ nādam̐ḍu nī kaivasa māya
serinaṭṭĕ javvanamu sĕllubaḍi kĕkkĕ nidĕ
neru pĕlla nī sŏmmĕ nī kela maram̐gu

(||ĕṁtaḍi||)
tadi vachchĕ kūḍamigi talavaṁcha nelamma
adam̐ḍu śhrīvĕṁkaḍeśhum̐ ḍaṁkĕṁ galasĕ
madiloni mudamulu māḍalasona gurisĕ
sadurada nī pālāya saṁkela nīgunu