Emtadi vivegulainaa yimmu depparamu laide

ఎంతటి వివేకులైనా యిమ్ము దెప్పరము లైతే
Language

(॥పల్లవి॥)
ఎంతటి వివేకులైనా యిమ్ము దెప్పరము లైతే
చెంత నీ చెలివలెనే చీకాకుపడుఁ బో

(॥ఎంతటి॥)
కన్నుల చెంగావి గట్టెఁ గలికి
యిన్ని నొలసీ నొల్లమి కిట్లానె పో
వెన్నెల మోమునఁ బూనె వెలఁది
చిన్నివిరహన మతి చిక్కువడుఁబో

(॥ఎంతటి॥)
చెక్కుల ముత్తేలు వెట్టీఁ జెలియా
యెక్కువఁ జవి దప్పీతే నిట్లానే పో
ముక్కున సురటి వీచీ ముదిత
పక్కనఁ బతిఁ బాసితే భ్రమ యిట్టే పో

(॥ఎంతటి॥)
పెదవిఁ గారాలు నించె బెరసి యింతి
యిదె పతి నొరసితి నిట్లానే పో
నిదురై శ్రీవేంకటేశు నెలఁత గూడె
వదలని వలపయితే వడీ నిట్టే పో

(||pallavi||)
ĕṁtaḍi vivegulainā yimmu dĕpparamu laide
sĕṁta nī sĕlivalĕne sīgāgubaḍum̐ bo

(||ĕṁtaḍi||)
kannula sĕṁgāvi gaṭṭĕm̐ galigi
yinni nŏlasī nŏllami kiṭlānĕ po
vĕnnĕla momunam̐ būnĕ vĕlam̐di
sinnivirahana madi sikkuvaḍum̐bo

(||ĕṁtaḍi||)
sĕkkula muttelu vĕṭṭīm̐ jĕliyā
yĕkkuvam̐ javi dappīde niṭlāne po
mukkuna suraḍi vīsī mudida
pakkanam̐ badim̐ bāside bhrama yiṭṭe po

(||ĕṁtaḍi||)
pĕdavim̐ gārālu niṁchĕ bĕrasi yiṁti
yidĕ padi nŏrasidi niṭlāne po
nidurai śhrīveṁkaḍeśhu nĕlam̐ta gūḍĕ
vadalani valabayide vaḍī niṭṭe po