ఎంతటి నేరుపరివి యేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఎంతటి నేరుపరివి యేమి చెప్పేది
వింత నీ చేఁతలు చూచి వేడుకవుట్టీని
(॥॥)
ప్రియములు చెప్పేవు పెనఁగవచ్చేవు నీ
నయగారి చేఁతలకు నవ్వువచ్చీని
దయలు వుట్టించేవు తగవులు నడుపేవు
నియతి నీసుద్దులకు నిండుకొనీ మోహము
(॥॥)
తొడపైఁ దొడ వేసేవు తోడనే బుజ్జగించేవు
వెడమాయ విద్యలకు వెరగయ్యీని
పెడరేఁచేవు చిత్తము బిగువుచన్నులంటేవు
బడి నీవినయానకు బాఁతిపడీ మనసు
(॥॥)
కందువ మోవియిచ్చేవు కాఁగిఁట గూడేవు నీ
చెందిన రతులు చూచి సిగ్గయ్యీని
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
సందడి నీగుణాలకు చవులు వుట్టీని
(||pallavi||)
ĕṁtaḍi nerubarivi yemi sĕppedi
viṁta nī sem̐talu sūsi veḍugavuṭṭīni
(||||)
priyamulu sĕppevu pĕnam̐gavachchevu nī
nayagāri sem̐talagu navvuvachchīni
dayalu vuṭṭiṁchevu tagavulu naḍubevu
niyadi nīsuddulagu niṁḍugŏnī mohamu
(||||)
tŏḍabaim̐ dŏḍa vesevu toḍane bujjagiṁchevu
vĕḍamāya vidyalagu vĕragayyīni
pĕḍarem̐sevu sittamu biguvusannulaṁṭevu
baḍi nīvinayānagu bām̐tibaḍī manasu
(||||)
kaṁduva moviyichchevu kām̐gim̐ṭa gūḍevu nī
sĕṁdina radulu sūsi siggayyīni
iṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
saṁdaḍi nīguṇālagu savulu vuṭṭīni