ఎంతటి మోహమో యేమని చెప్పుదు
(॥పల్లవి॥)
ఎంతటి మోహమో యేమని చెప్పుదు
వింత రతులఁ గడు వెలయించేవు
(॥ఎంత॥)
చెలప చెమటలు చెలిపైఁ దొరుగఁగ
వలపులు చల్లేవు వరుఁడవు
మొలకల పులకల మోసులు నాటఁగ
కెలయుచు నిటు కాఁగిట నించేవు
(॥ఎంత॥)
నిట్టూర్పు సురటుల నెలఁతకు విసరుచు
గుట్టున వలపులు గురిసేవు
తెట్టెల మోవులతేనెలు గారఁగ
తొట్టుకొనఁగ విందులు వెట్టేవు
(॥ఎంత॥)
వెలయఁగఁ గాఁగిలి విడిదలసేయుచు
చెలఁగి కాఁపురము సేసేవు
అలమేల్మంగను అదె శ్రీవేంకట -
నిలయుఁడ పొందులు నెరవేర్చేవు
(||pallavi||)
ĕṁtaḍi mohamo yemani sĕppudu
viṁta radulam̐ gaḍu vĕlayiṁchevu
(||ĕṁta||)
sĕlaba sĕmaḍalu sĕlibaim̐ dŏrugam̐ga
valabulu sallevu varum̐ḍavu
mŏlagala pulagala mosulu nāḍam̐ga
kĕlayusu niḍu kām̐giḍa niṁchevu
(||ĕṁta||)
niṭṭūrbu suraḍula nĕlam̐tagu visarusu
guṭṭuna valabulu gurisevu
tĕṭṭĕla movuladenĕlu gāram̐ga
tŏṭṭugŏnam̐ga viṁdulu vĕṭṭevu
(||ĕṁta||)
vĕlayam̐gam̐ gām̐gili viḍidalaseyusu
sĕlam̐gi kām̐puramu sesevu
alamelmaṁganu adĕ śhrīveṁkaḍa -
nilayum̐ḍa pŏṁdulu nĕraversevu