Emtadi magavaamdavu yemtigi neegum gomkanu

ఎంతటి మగవాఁడవు యేఁటికి నీకుఁ గొంకను
Language

(॥పల్లవి॥)
ఎంతటి మగవాఁడవు యేఁటికి నీకుఁ గొంకను
చింతలేక నీ యిచ్చలఁ జెలరేఁగరాదా

(॥ఎంత॥)
మొగము చూచిన లోలో ముసుగువెట్టుకొనేవు
చిగురుగోరిచేఁతలు చెక్కులంటెనో
నగుతా కొంగువట్టితే నంటున సిగ్గువడేవు
అగడుగా నెవ్వతైనా ఆయాలు సోఁకించెనో

(॥ఎంత॥)
కందువమేను ముట్టితే గందము వూసుకొనేవు
విందుల నీపులకలు వెల్లవిరయ్యీనా
మందలించి మాటాడితే మౌనాననున్నాఁడవు
యిందులో నీబుసకొట్లెరఁగ వచ్చీనా

(॥ఎంత॥)
చన్నుల నిన్నొత్తితే సారెసారె లోఁగేవు
అన్నిటా నీవలపులు అట్టే కాఁగీనా
మన్నించిన యలమేలు మంగనై నిన్నుఁగూడితి
సన్నల శ్రీవెంకటేశ సంతోసషములాయఁగా

(||pallavi||)
ĕṁtaḍi magavām̐ḍavu yem̐ṭigi nīgum̐ gŏṁkanu
siṁtalega nī yichchalam̐ jĕlarem̐garādā

(||ĕṁta||)
mŏgamu sūsina lolo musuguvĕṭṭugŏnevu
sigurugorisem̐talu sĕkkulaṁṭĕno
nagudā kŏṁguvaṭṭide naṁṭuna sigguvaḍevu
agaḍugā nĕvvadainā āyālu som̐kiṁchĕno

(||ĕṁta||)
kaṁduvamenu muṭṭide gaṁdamu vūsugŏnevu
viṁdula nībulagalu vĕllavirayyīnā
maṁdaliṁchi māḍāḍide maunānanunnām̐ḍavu
yiṁdulo nībusagŏṭlĕram̐ga vachchīnā

(||ĕṁta||)
sannula ninnŏttide sārĕsārĕ lom̐gevu
anniḍā nīvalabulu aṭṭe kām̐gīnā
manniṁchina yalamelu maṁganai ninnum̐gūḍidi
sannala śhrīvĕṁkaḍeśha saṁtosaṣhamulāyam̐gā