ఎంతటి జాణ యీపె యెటువంటి వొయ్యారి
(॥పల్లవి॥)
ఎంతటి జాణ యీపె యెటువంటి వొయ్యారి
వింతలెల్లాఁ గంటి మిదె వినోదించవయ్యా
(॥ఎంత॥)
చెక్కు చేయి మాఁటువెట్టి సిగ్గులు వడుకొంటాను
తక్కించీ నిన్నీకె యవదరించవయ్యా
లక్కబుఱ్ఱవంటి నోఱు లలిఁ దెరచి మాఁటాడి
నిక్క కానుక లందిచ్చీ నీ వందుకోవయ్యా
(॥ఎంత॥)
విరులు కొప్పున రాల విక విక నవ్వుకొంటా
కెరలించీ నిన్నుఁ జిత్తగించవయ్యా
సరిఁ జన్నులఁ బయ్యద జారిరాఁగా మూసుకొంటా
సురటి విసరీ నీకుఁ జొక్కి మెచ్చవయ్యా
(॥ఎంత॥)
కలికి కన్నుల నిన్నుఁ గాతరానఁ జూచుకొంటా
వలపించీఁ దొడపైఁ బవ్వళించవయ్యా
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
కొలువులో నున్న యాకె కోరికె చేకొనవయ్యా
(||pallavi||)
ĕṁtaḍi jāṇa yībĕ yĕḍuvaṁṭi vŏyyāri
viṁtalĕllām̐ gaṁṭi midĕ vinodiṁchavayyā
(||ĕṁta||)
sĕkku seyi mām̐ṭuvĕṭṭi siggulu vaḍugŏṁṭānu
takkiṁchī ninnīgĕ yavadariṁchavayyā
lakkabuṭravaṁṭi noṟu lalim̐ dĕrasi mām̐ṭāḍi
nikka kānuga laṁdichchī nī vaṁdugovayyā
(||ĕṁta||)
virulu kŏppuna rāla viga viga navvugŏṁṭā
kĕraliṁchī ninnum̐ jittagiṁchavayyā
sarim̐ jannulam̐ bayyada jārirām̐gā mūsugŏṁṭā
suraḍi visarī nīgum̐ jŏkki mĕchchavayyā
(||ĕṁta||)
kaligi kannula ninnum̐ gādarānam̐ jūsugŏṁṭā
valabiṁchīm̐ dŏḍabaim̐ bavvaḽiṁchavayyā
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
kŏluvulo nunna yāgĕ korigĕ segŏnavayyā