ఎంతటఁ గాని మెచ్చవు ఇంకా నిది
(॥పల్లవి॥)
ఎంతటఁ గాని మెచ్చవు ఇంకా నిది
పంతానకు నీవే పైకొనవద్దా యిది
(॥॥)
పక్కుఁన నలిగినట్టిపడఁతి ఇవ్వలిమోమై
చక్కఁగా నిన్నుఁజూచెఁ జాలదా యిది
గుక్కక కానిమాటలు గొణఁగిననోటనే
గక్కునిన్నుఁ బిలిచెఁ గాదా యిది
(॥॥)
వలవంత గోపగించి వంచినట్టిరెప్పలనే
మెలపున నిన్నుఁ జూచె మేలుగా యిది
చలయిలే యిందాఁకా సాదించినట్టీనీ -
చెలి నీతో నవ్వె చెల్లదా యిది
(॥॥)
వేడుక నీవు వట్టితే విదిలించుకొన్నచేత
వీడెమిచ్చి వూరకుండె వెలితా యిది
వీడుపడ్డచోనే శ్రీ వేంకటేశ కూడెఁ జెలి
యీడఁ దనివి దీరదా ఇంకా నిది
(||pallavi||)
ĕṁtaḍam̐ gāni mĕchchavu iṁkā nidi
paṁtānagu nīve paigŏnavaddā yidi
(||||)
pakkum̐na naliginaṭṭibaḍam̐ti ivvalimomai
sakkam̐gā ninnum̐jūsĕm̐ jāladā yidi
gukkaga kānimāḍalu gŏṇam̐ginanoḍane
gakkuninnum̐ bilisĕm̐ gādā yidi
(||||)
valavaṁta gobagiṁchi vaṁchinaṭṭirĕppalane
mĕlabuna ninnum̐ jūsĕ melugā yidi
salayile yiṁdām̐kā sādiṁchinaṭṭīnī -
sĕli nīdo navvĕ sĕlladā yidi
(||||)
veḍuga nīvu vaṭṭide vidiliṁchugŏnnaseda
vīḍĕmichchi vūraguṁḍĕ vĕlidā yidi
vīḍubaḍḍasone śhrī veṁkaḍeśha kūḍĕm̐ jĕli
yīḍam̐ danivi dīradā iṁkā nidi