ఎంతపుణ్యమో యిటు మాకుఁ గలిగె
(॥పల్లవి॥)
ఎంతపుణ్యమో యిటు మాకుఁ గలిగె
చెంతనే నీకృప సిద్ధించఁ బోలు
(॥ఎంత॥)
శ్రీపతి మీకథ చెవులను వింటిమి
పాపము లణఁగెను భయ ముడిగె
తీపుగఁ దులసితీర్థము గొంటిమి
శాపము దీరెను సఫలంబాయ
(॥ఎంత॥)
గోవింద మిముఁ గనుఁగొంటి మిప్పుడే
పావనమైతిమి బ్రతికితిమి
తావుల మీపాదములకు మొక్కితి
వేవేలుఁ గలిగెను వేడుకలాయ
(॥ఎంత॥)
శ్రీవేంకటేశ్వర సేవించితి మిము
దావతి దీరెను తనిసితిమి
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి
నీవారమైతివి నిలిచితి మిపుడు
(||pallavi||)
ĕṁtabuṇyamo yiḍu māgum̐ galigĕ
sĕṁtane nīkṛpa siddhiṁcham̐ bolu
(||ĕṁta||)
śhrībadi mīgatha sĕvulanu viṁṭimi
pābamu laṇam̐gĕnu bhaya muḍigĕ
tībugam̐ dulasidīrdhamu gŏṁṭimi
śhābamu dīrĕnu saphalaṁbāya
(||ĕṁta||)
goviṁda mimum̐ ganum̐gŏṁṭi mippuḍe
pāvanamaidimi bradigidimi
tāvula mībādamulagu mŏkkidi
vevelum̐ galigĕnu veḍugalāya
(||ĕṁta||)
śhrīveṁkaḍeśhvara seviṁchidi mimu
dāvadi dīrĕnu tanisidimi
vāviri mummāru valagŏni vachchidi
nīvāramaidivi nilisidi mibuḍu