Emtabani kemtabani yela padareve neevu

ఎంతపని కెంతపని యేల పదరేవే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంతపని కెంతపని యేల పదరేవే నీవు
కాంతుఁడు చెలరేఁగితే కందువలు ముట్టవా

(॥ఎంత॥)
తగునా నీ కింతమాట తరుణి యాతనితోడ
చిగురుఁబెదవి వంచి ‘చీ’ యంటివి
మొగము చూచి యతఁడు ముంచి నవ్వె నింతేకాని
తగవులఁ బెట్టఁబోతే తప్పు నీదే కాదా

(॥ఎంత॥)
చెల్లునా నీ కింత సేఁత చెలువునితోడను
మెల్లనే నేమంతిచెండు మీఁదవేసితి
వల్లగా నాతఁ డందుకు సరసములాడెఁగాని
వొల్లనే మారువేసితే నోరుచుకెఁగలనా

(॥ఎంత॥)
అమరునా శ్రీవేంకటాధీశ్వరునితోడ
తమకించలిగితి విందాఁకా నీవు
రమణ నాతఁడే నిన్ను రతులఁ గలసెఁగాని
సమముగాఁ బెనఁగితే చాలుననవచ్చునా

(||pallavi||)
ĕṁtabani kĕṁtabani yela padareve nīvu
kāṁtum̐ḍu sĕlarem̐gide kaṁduvalu muṭṭavā

(||ĕṁta||)
tagunā nī kiṁtamāḍa taruṇi yādanidoḍa
sigurum̐bĕdavi vaṁchi ‘sī’ yaṁṭivi
mŏgamu sūsi yadam̐ḍu muṁchi navvĕ niṁtegāni
tagavulam̐ bĕṭṭam̐bode tappu nīde kādā

(||ĕṁta||)
sĕllunā nī kiṁta sem̐ta sĕluvunidoḍanu
mĕllane nemaṁtisĕṁḍu mīm̐davesidi
vallagā nādam̐ ḍaṁdugu sarasamulāḍĕm̐gāni
vŏllane māruveside norusugĕm̐galanā

(||ĕṁta||)
amarunā śhrīveṁkaḍādhīśhvarunidoḍa
tamagiṁchaligidi viṁdām̐kā nīvu
ramaṇa nādam̐ḍe ninnu radulam̐ galasĕm̐gāni
samamugām̐ bĕnam̐gide sālunanavachchunā