ఎంతపని గలిగేనో యేమి సాదించెనోకాని
(॥పల్లవి॥)
ఎంతపని గలిగేనో యేమి సాదించెనోకాని
వింతగా నప్పటినుండి వేళగాచుకున్నది
(॥ఎంత॥)
చిన్నిచిన్నిచెమటలు చెక్కులపైఁ బొడమఁగా
విన్నపా లెంతసేసీని వెలఁది నీకు
పన్నుగాఁ జన్నులమీఁదిపయ్యద కొంత జారఁగా
మిన్నక కొలువు సేమీ మిక్కిలి నీకు
(॥ఎంత॥)
పెనగొన్ననగవులు పెదవిపైఁ బెట్టుకొని
వినయాలు సేసిని వెలఁది నీకు
నినుపులచూపుల నీమొగమే చూచుకొంటా
యెనయుచు సన్నలు నీకే లందుకుఁ జేసీని
(॥ఎంత॥)
తొడఁదొడ గాజులు చేతులనుండి వాఁగఁగాను
వీడే లెంతయిచ్చీని వెలఁది నీకు
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వాడిక లేమిచూపీని వంతులఁదా నీకు
(||pallavi||)
ĕṁtabani galigeno yemi sādiṁchĕnogāni
viṁtagā nappaḍinuṁḍi veḽagāsugunnadi
(||ĕṁta||)
sinnisinnisĕmaḍalu sĕkkulabaim̐ bŏḍamam̐gā
vinnabā lĕṁtasesīni vĕlam̐di nīgu
pannugām̐ jannulamīm̐dibayyada kŏṁta jāram̐gā
minnaga kŏluvu semī mikkili nīgu
(||ĕṁta||)
pĕnagŏnnanagavulu pĕdavibaim̐ bĕṭṭugŏni
vinayālu sesini vĕlam̐di nīgu
ninubulasūbula nīmŏgame sūsugŏṁṭā
yĕnayusu sannalu nīge laṁdugum̐ jesīni
(||ĕṁta||)
tŏḍam̐dŏḍa gājulu sedulanuṁḍi vām̐gam̐gānu
vīḍe lĕṁtayichchīni vĕlam̐di nīgu
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vāḍiga lemisūbīni vaṁtulam̐dā nīgu