ఎంత యిచ్చకురాలో యేమి చేప్పేది
(॥పల్లవి॥)
ఎంత యిచ్చకురాలో యేమి చేప్పేది
బంతినే నీ కెరుకగా పాటవాడీ నొకతె
(॥॥)
యెన్నికతో నాకె నీవూ నేకతమాడఁగాను
కన్నులనే సన్న నేసీ కాంత యొకతె
వెన్నెలబయట మీరు వేడుకలు జరుపఁగా-
నున్నతితో నీపైఁ బువ్వుల వేసీ నొకతె
(॥॥)
గుట్టున వీ వాకెవద్దఁ గూచుండఁ గా నెచ్చరించి
ఱట్టుగాఁ జన్నులనే జఱసీ నొకతె
పట్టెమంచముమీఁద బాగాలు మీ రందుగోఁగా
చుట్టుక నిన్నెలయించి చూచీ నొకతె
(॥॥)
పచ్చగా నీ వాకెఁ గూడి పరవశమై చొక్కఁగా
కుచ్చి నిన్ను గోర నూఁది కూడె నొకతె
మెచ్చి శ్రీ వేంకటేశుఁడ మేడలో మీరుండుఁ గాను
తచ్చి బాసలు గొని ముందర నున్న దొకతె
(||pallavi||)
ĕṁta yichchagurālo yemi seppedi
baṁtine nī kĕrugagā pāḍavāḍī nŏgadĕ
(||||)
yĕnnigado nāgĕ nīvū negadamāḍam̐gānu
kannulane sanna nesī kāṁta yŏgadĕ
vĕnnĕlabayaḍa mīru veḍugalu jarubam̐gā-
nunnadido nībaim̐ buvvula vesī nŏgadĕ
(||||)
guṭṭuna vī vāgĕvaddam̐ gūsuṁḍam̐ gā nĕchchariṁchi
ṟaṭṭugām̐ jannulane jaṟasī nŏgadĕ
paṭṭĕmaṁchamumīm̐da bāgālu mī raṁdugom̐gā
suṭṭuga ninnĕlayiṁchi sūsī nŏgadĕ
(||||)
pachchagā nī vāgĕm̐ gūḍi paravaśhamai sŏkkam̐gā
kuchchi ninnu gora nūm̐di kūḍĕ nŏgadĕ
mĕchchi śhrī veṁkaḍeśhum̐ḍa meḍalo mīruṁḍum̐ gānu
tachchi bāsalu gŏni muṁdara nunna dŏgadĕ