ఎంత యెడగొల్లకత్తె వేమే నీవు
(॥పల్లవి॥)
ఎంత యెడగొల్లకత్తె వేమే నీవు
జంతవై వలపు లిట్టిచవులు గొనేవు
(॥॥)
కురులు దువ్వేనంటా గుబ్బల నొత్తుకొనేవు
సరులు గట్టేనంటా సారెకుఁ గాఁగిలించేవు
శిరసంటేనానంటాను చెక్కుఁ జెక్కు మోపించేవు
బెరసి విభుని నెంత పిప్పిసేసేవే
(॥॥)
కైదండ యిచ్చేనంటా కాయము సోఁకించేవు
పాదాలొత్తేనంటాఁ దొడపైకిఁ దీసుకొనేవు
ఆదట జలకమార్చేనంటా నొరసుకొనేవు
గోదిలిమోహన నెంతగుబ్బతిలేవే
(॥॥)
తములాన కొగ్గేనంటా తగ మోవి దాఁకించేవు
చెమట దుడిచేనంటా సిగ్గులంటి పెనఁగేవు
అమర శ్రీ వేంకటేశుఁ డన్నిటాను నన్నుఁ గూడె
భ్రమసి నీవెందాఁ కాను బాఁతిపడేవే
(||pallavi||)
ĕṁta yĕḍagŏllagattĕ veme nīvu
jaṁtavai valabu liṭṭisavulu gŏnevu
(||||)
kurulu duvvenaṁṭā gubbala nŏttugŏnevu
sarulu gaṭṭenaṁṭā sārĕgum̐ gām̐giliṁchevu
śhirasaṁṭenānaṁṭānu sĕkkum̐ jĕkku mobiṁchevu
bĕrasi vibhuni nĕṁta pippiseseve
(||||)
kaidaṁḍa yichchenaṁṭā kāyamu som̐kiṁchevu
pādālŏttenaṁṭām̐ dŏḍabaigim̐ dīsugŏnevu
ādaḍa jalagamārsenaṁṭā nŏrasugŏnevu
godilimohana nĕṁtagubbadileve
(||||)
tamulāna kŏggenaṁṭā taga movi dām̐kiṁchevu
sĕmaḍa duḍisenaṁṭā siggulaṁṭi pĕnam̐gevu
amara śhrī veṁkaḍeśhum̐ ḍanniḍānu nannum̐ gūḍĕ
bhramasi nīvĕṁdām̐ kānu bām̐tibaḍeve