ఎంత వుపకారివి యేమని పొగడుదును
(॥పల్లవి॥)
ఎంత వుపకారివి యేమని పొగడుదును
వింతచేఁతలను నాకు వేడుకసేసితివి
(॥ఎంత॥)
ఆసలుగా నీగురుతు లటు గొన్ని పెట్టి పంపి
పాసివున్న విరహతాపము మాన్పితి
సేసవెట్టినగురుతు చెప్పిపంపి అప్పటిని
వేసటలు దీర నన్ను వెడ్డువెట్టితివి
(॥ఎంత॥)
తనివార నాకు నేడు తతితో నీరూపు చూపి
మనసులోపలిచింత మానిపితివి
చెనకి చేయిమీఁద చేయివేసి యింతలోనే
తనువుపైకాఁకలార దప్పులు దేర్చితివి
(॥ఎంత॥)
గక్కన నింటికి వచ్చి కాఁగిట నన్నుఁ గూడి
ఇక్కడ నాకోరికె లీడేర్చితివి
నిక్కము శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
చొక్కపురతుల నన్నుఁ జొక్కించి యేలితివి
(||pallavi||)
ĕṁta vubagārivi yemani pŏgaḍudunu
viṁtasem̐talanu nāgu veḍugasesidivi
(||ĕṁta||)
āsalugā nīgurudu laḍu gŏnni pĕṭṭi paṁpi
pāsivunna virahadābamu mānpidi
sesavĕṭṭinagurudu sĕppibaṁpi appaḍini
vesaḍalu dīra nannu vĕḍḍuvĕṭṭidivi
(||ĕṁta||)
tanivāra nāgu neḍu tadido nīrūbu sūbi
manasulobalisiṁta mānibidivi
sĕnagi seyimīm̐da seyivesi yiṁtalone
tanuvubaigām̐kalāra dappulu dersidivi
(||ĕṁta||)
gakkana niṁṭigi vachchi kām̐giḍa nannum̐ gūḍi
ikkaḍa nāgorigĕ līḍersidivi
nikkamu śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
sŏkkaburadula nannum̐ jŏkkiṁchi yelidivi