Emta vorusugumdivaa neṟamgavu neeyamta

ఎంత వోరుచుకుండివా నెఱఁగవు నీయంత
Language

(॥పల్లవి॥)
ఎంత వోరుచుకుండివా నెఱఁగవు నీయంత
వింతగా నీతనికిని వేరేపనులు లేవా

(॥ఎంత॥)
చెంతనుండి యెందాఁకాఁ జేసేవే విన్నపాలు
కాంతలందరు వాకిటఁ గాచుకుండఁగా
వంతుకు సింగారించుతా వాకిలేల వెళ్లనీవే
యెంతపోద్దాయను వేగి యేఁటిదే నీనేరుపు

(॥ఎంత॥)
సారె భ్రమయించుకొంటా చన్ను లేమిచూపేవే
సోరణగండ్ల నందరుఁ జూచుకుండగా
తోరపుఁదెర వేసుక తొంగి యేల చూడనీవే
ఆరగించేవేళాయ నవునే నీనేరుపు

(॥ఎంత॥)
లలి విడెమిచ్చుకొంటా లావు లేమిచూపేవే
బలిమి నేఁ జొచ్చి వచ్చి పాదాలొత్తఁగా
అలమేలుమంగపతి యతఁడు శ్రీవేంకటేశుఁ-
డెలమి నన్నేలె నీడ యిఁకనే నీనేరువు

(||pallavi||)
ĕṁta vorusuguṁḍivā nĕṟam̐gavu nīyaṁta
viṁtagā nīdanigini verebanulu levā

(||ĕṁta||)
sĕṁtanuṁḍi yĕṁdām̐kām̐ jeseve vinnabālu
kāṁtalaṁdaru vāgiḍam̐ gāsuguṁḍam̐gā
vaṁtugu siṁgāriṁchudā vāgilela vĕḽlanīve
yĕṁtaboddāyanu vegi yem̐ṭide nīnerubu

(||ĕṁta||)
sārĕ bhramayiṁchugŏṁṭā sannu lemisūbeve
soraṇagaṁḍla naṁdarum̐ jūsuguṁḍagā
torabum̐dĕra vesuga tŏṁgi yela sūḍanīve
āragiṁcheveḽāya navune nīnerubu

(||ĕṁta||)
lali viḍĕmichchugŏṁṭā lāvu lemisūbeve
balimi nem̐ jŏchchi vachchi pādālŏttam̐gā
alamelumaṁgabadi yadam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍĕlami nannelĕ nīḍa yim̐kane nīneruvu