Emta vorusugumdinaa neṟamgavu naamumdara

ఎంత వోరుచుకుండినా నెఱఁగవు నాముందర
Language

(॥పల్లవి॥)
ఎంత వోరుచుకుండినా నెఱఁగవు నాముందర
వింతలుగా నెంతేసి వేసాలుసేసేవే

(॥ఎంత॥)
వన్నెలు వెట్టుకొంటేనే వాసికత్తెవైతివా
చన్నులు గొప్పలై తేనే జాణవైతివా
సన్నపుచీర గట్టితే సరి దొరవైతివా
ఇన్నిటా నాపతితోడ నేమిమాటలాడేవే

(॥ఎంత॥)
నిక్కుఁగొప్పు వెట్టితే నేరుపరి వైతివా
పుక్కిట విడె ముంటేనే భోగివైతివా
చెక్కిటఁ జేయిడుకొంటే చేఁతలాఁడివైతివా
ఇక్కడ నితనితోడ నేమినవ్వేవే

(॥ఎంత॥)
సంగడిఁ గూచుండితేనే చనవరివైతివా
అంగాలు సోఁకించితే నొయ్యారివైతివా
చెంగట నలమేల్మంగఁ జెంది శ్రీవేంకటేశుఁడు
యింగితమెఱింగి నన్ను నేలె నేమిసేసేవే

(||pallavi||)
ĕṁta vorusuguṁḍinā nĕṟam̐gavu nāmuṁdara
viṁtalugā nĕṁtesi vesāluseseve

(||ĕṁta||)
vannĕlu vĕṭṭugŏṁṭene vāsigattĕvaidivā
sannulu gŏppalai tene jāṇavaidivā
sannabusīra gaṭṭide sari dŏravaidivā
inniḍā nābadidoḍa nemimāḍalāḍeve

(||ĕṁta||)
nikkum̐gŏppu vĕṭṭide nerubari vaidivā
pukkiḍa viḍĕ muṁṭene bhogivaidivā
sĕkkiḍam̐ jeyiḍugŏṁṭe sem̐talām̐ḍivaidivā
ikkaḍa nidanidoḍa neminavveve

(||ĕṁta||)
saṁgaḍim̐ gūsuṁḍidene sanavarivaidivā
aṁgālu som̐kiṁchide nŏyyārivaidivā
sĕṁgaḍa nalamelmaṁgam̐ jĕṁdi śhrīveṁkaḍeśhum̐ḍu
yiṁgidamĕṟiṁgi nannu nelĕ nemiseseve