(॥పల్లవి॥)
ఎంత వోరిచిన నెఱుంగడు తన
వింత సుద్దు లెల్లా విడిపింతునా
(॥ఎంత॥)
చూడరే వీని సుద్దు లెల్లా చను
జోడు నుంచి మొనచూపెనటా
యేడ నేరిచెనే యింతేసి తన
వీడెపు మోవి వెలయింతునా
(॥ఎంత॥)
మానఁడె తనమాటల నా
సోన చూపు తను సోఁకె నట
యేనెపమునేసీ నిందుకు తను
గాని తిట్ల నే కరగింతుని
(॥ఎంత॥)
వినరే వీనివైనాలు తనుఁ
ననిచి నామోము నవ్వె నటా
యెనసి శ్రీవేంకటేశ్వరుఁడు యిట్టె
చన విచ్చె యింక సాదింతునా
(||pallavi||)
ĕṁta vorisina nĕṟuṁgaḍu tana
viṁta suddu lĕllā viḍibiṁtunā
(||ĕṁta||)
sūḍare vīni suddu lĕllā sanu
joḍu nuṁchi mŏnasūbĕnaḍā
yeḍa nerisĕne yiṁtesi tana
vīḍĕbu movi vĕlayiṁtunā
(||ĕṁta||)
mānam̐ḍĕ tanamāḍala nā
sona sūbu tanu som̐kĕ naḍa
yenĕbamunesī niṁdugu tanu
gāni tiṭla ne karagiṁtuni
(||ĕṁta||)
vinare vīnivainālu tanum̐
nanisi nāmomu navvĕ naḍā
yĕnasi śhrīveṁkaḍeśhvarum̐ḍu yiṭṭĕ
sana vichchĕ yiṁka sādiṁtunā