Emta vorbu galadaana veme neevu

ఎంత వోర్పు గలదాన వేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత వోర్పు గలదాన వేమే నీవు
కాంతలెల్లా నీ సుద్దులు కతలుగాఁ జెప్పేరే

(॥ఎంత॥)
ఘనమైనవిరహగ్నిఁ గాఁగియు నప్పటిఁ బతి-
మనసు నొవ్వకుండానే మాటలాడేవే
యెనయక మరుచేత నేటువడి యింకా నాఁ
తనితోనే పొందు సేయఁ దమకించేవు

(॥ఎంత॥)
వొల్లనే యాసతివద్ద నుండఁగా విభునిఁ జూచి
వొళ్లు దాఁకకుండాఁ బువ్వుల వేసేవే
పల్లదపుజవ్వనము పంచపాలై మరిఁ
నుల్లసాన నవ్వుతాను ఊడిగాలు సేసేవే

(॥ఎంత॥)
గక్కన శ్రీవేంకటేశుకాఁగిటఁ జిక్కి యప్పటి
కక్కసించ కేల మొగము చూచేవే
చక్కఁగా రతిపరవశమున నన్నీ మరచి
చొక్కుచు నాతనినే మెచ్చులు మెచ్చేవే

(||pallavi||)
ĕṁta vorbu galadāna veme nīvu
kāṁtalĕllā nī suddulu kadalugām̐ jĕppere

(||ĕṁta||)
ghanamainavirahagnim̐ gām̐giyu nappaḍim̐ badi-
manasu nŏvvaguṁḍāne māḍalāḍeve
yĕnayaga maruseda neḍuvaḍi yiṁkā nām̐
tanidone pŏṁdu seyam̐ damagiṁchevu

(||ĕṁta||)
vŏllane yāsadivadda nuṁḍam̐gā vibhunim̐ jūsi
vŏḽlu dām̐kaguṁḍām̐ buvvula veseve
palladabujavvanamu paṁchabālai marim̐
nullasāna navvudānu ūḍigālu seseve

(||ĕṁta||)
gakkana śhrīveṁkaḍeśhugām̐giḍam̐ jikki yappaḍi
kakkasiṁcha kela mŏgamu sūseve
sakkam̐gā radibaravaśhamuna nannī marasi
sŏkkusu nādanine mĕchchulu mĕchcheve