Emta vesaalu sesevu yelayimpu semtalanu

ఎంత వేసాలు సేసేవు యెలయింపు సేఁతలను
Language

(॥పల్లవి॥)
ఎంత వేసాలు సేసేవు యెలయింపు సేఁతలను
సంతోసించుకొంటి నిఁకఁ జనవియ్యరాదా

(॥ఎంత॥)
మచ్చికెమాట లాడితే మనసులోఁ దనియునా
కుచ్చి బిగ్గెఁ గౌఁగిలించుకొంటేఁ గాక
మెచ్చి మెచ్చి పొగడితే మేనులు గదుసునా
పిచ్చిలఁ జెమటరేఁగఁ బెనఁగితేఁ గాక

(॥ఎంత॥)
తప్పక చూచితేను తనిసినట్టే వుండునా
అప్పసపురతుల నోలలాడితేఁ గాక
కప్పురవీడె మిచ్చితే కడు నాస దీరునా
దప్పిదేర మోవి యిచ్చి తనిపితేఁ గాక

(॥ఎంత॥)
కనుఁగొని పచ్చడము గప్పినఁ బంత మెక్కునా
ననుపునఁగొనగోళ్ళు నాఁటితే గాక
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
చన విచ్చి కూడితే చవులే నావి గాకా

(||pallavi||)
ĕṁta vesālu sesevu yĕlayiṁpu sem̐talanu
saṁtosiṁchugŏṁṭi nim̐kam̐ janaviyyarādā

(||ĕṁta||)
machchigĕmāḍa lāḍide manasulom̐ daniyunā
kuchchi biggĕm̐ gaum̐giliṁchugŏṁṭem̐ gāga
mĕchchi mĕchchi pŏgaḍide menulu gadusunā
pichchilam̐ jĕmaḍarem̐gam̐ bĕnam̐gidem̐ gāga

(||ĕṁta||)
tappaga sūsidenu tanisinaṭṭe vuṁḍunā
appasaburadula nolalāḍidem̐ gāga
kappuravīḍĕ michchide kaḍu nāsa dīrunā
dappidera movi yichchi tanibidem̐ gāga

(||ĕṁta||)
kanum̐gŏni pachchaḍamu gappinam̐ baṁta mĕkkunā
nanubunam̐gŏnagoḽḽu nām̐ṭide gāga
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
sana vichchi kūḍide savule nāvi gāgā